మరోసారి ‘సలార్’ నుంచి ఫుటేజ్ లీక్..!

0
257
Leaked Shooting Photos and Videos of Prabhas Salaar Goes Viral

Salaar Movie Leaks: ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. వరుస సినిమాలని లైన్లో పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ప్ర‌భాస్ పుట్టిన‌రోజున ఈ సినిమా నుంచి ఏదైనా లుక్ లేదా టీజ‌ర్ రూపంలో అభిమానుల‌కు మేక‌ర్స్ ఏమైనా ట్రీట్ ఇస్తారేమోన‌ని అంద‌రూ భావించారు.

కరోనాతో ఇది మరింత ఎక్కువైంది. ఇలాంటి సమయంలో రాబోయే సినిమాల నుంచి చిన్న చిన్న వీడియోలు లీక్ అవుతున్నాయి. కొంతమంది సినిమా ఫుటేజ్ నుంచి లేదా షూటింగ్ జరిగే సమయంలో వీడియో తీసి లీక్ చేస్తున్నారు. ‘స‌లార్‌’ మూవీ షూటింగ్ జ‌రుగుత‌న్న‌ప్ప‌టి నుంచి సినిమాకు సంబంధించిన ఫొటోలు, చిన్న చిన్న వీడియోలు లీక్ అవుతూ వ‌స్తున్నాయి.

ఈపుడు మ‌రో వీడియో లీక్ కావ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ‘స‌లార్‌’ మూవీ సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచే ఈ వీడియో లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leaked Shooting Photos and Videos of Prabhas Salaar Goes Viral

ఈ లీకేజీని ఎలా ఆపాలో తెలియ‌క మేక‌ర్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న స‌లార్‌ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. కానీ అదే రోజున కె.జి.య‌ఫ్ ఛాప్ట‌ర్ 2 సినిమా విడుద‌ల‌వుతుంది. దీంతో స‌లార్ రిలీజ్ డేట్ మార‌డం ఫిక్స్ అని తెలిసింది.

Also Read: ‘పుష్ప ది రైజ్’ షూటింగ్ అప్‌డేట్..! 

Leaked Shooting Photos and Videos of Prabhas Salaar Goes Viral

 

 

Web Title: Leaked Shooting Photos and Videos of Prabhas Salaar Goes Viral, Salaar leaked Photos, Salaar shooting pics, Prabhas Salaar leaked videos, Shooting Update, Shruti Haasan.

Previous article‘పుష్ప ది రైజ్’ షూటింగ్ అప్‌డేట్..!
Next articleఆర్జీవీ కి రివర్స్ పంచ్ ఇచ్చిన మనోజ్..!