ప్రకాష్ రాజ్ రాజీనామా పట్ల స్పందించిన మంచు విష్ణు

0
220
Manchu Vishnu comments on Prakash Raj resigns to maa membership

Prakash Raj, Vishnu Manchu: MAA ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన తరువాత, ప్రకాష్ రాజ్ తన MAA సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, పూర్తిగా ఆలోచనా ప్రక్రియ తర్వాతనే రాజీనామా చేశాను అని చెపారు.

ప్రకాష్ రాజ్ తనకు MAA తో 21 సంవత్సరాల అనుబంధం ఉందని, అయితే అతను స్థానిక మరియు స్థానికేతర ఎజెండాల కారణంగా బయటకు వెళ్తున్నాడని పేర్కొన్నాడు. కాగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు.

తనను అభినందిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ఓ వాట్సప్ మెసేజీకి బదులు ఇచ్చారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘‘అభినంద‌న‌లు తెలియ‌జేసినందుకు ధ‌న్య‌వాదాలు. అయితే మీరు తీసుకున్న రాజీనామా నిర్ణ‌యంపై నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద‌వారు. గెలుపోట‌ములు ఓ నాణేనికి రెండు వైపులా ఉంటాయి.

Manchu Vishnu comments on Prakash Raj resigns to maa membership

ఈ రెండింటినీ ఒకేలా స్వీక‌రించాల‌ని మీకు కూడా తెలుసు. మీరు ఎమోష‌న‌ల్‌గా ఆలోచించ‌కండి. మీరు మా కుటుంబంలో ఓ భాగం. మీ ఆలోచ‌న‌లు నాకు కావాలి. మ‌నం క‌లిసి ప‌నిచేద్దాం. ఇప్పుడు మీరు నాకు రిప్ల‌య్ ఇవ్వ‌కండి. నేను మిమ్మ‌ల్ని త్వ‌ర‌లోనే క‌లిసి మాట్లాడుతాను. ద‌య‌చేసి తొంద‌ర‌ప‌డ‌కండి’’ అన్నారు.

 

 

Web Title: Manchu Vishnu comments on Prakash Raj resigns to maa membership, Prakash Raj Resigns To His MAA Membership, Manchu Vishnu Whatsapp Chat with Prakash Raj. 

Previous articleNaga Chaitanya, Vikram Kumar next gets a tentative release date
Next articleBigg Boss Telugu 5 Nominated Contestants List For Sixth Week