మెగా ఫ్యామిలీని మరోసారి గెలికిన మోహన్ బాబు, మంచు విష్ణు..!

0
1164
Mohan Babu, Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan

Manchu Vishnu Comments On Mega Family: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన కుమారుడు విష్ణు విజయం సాధించినందుకు మంచు మోహన్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ లో విష్ణు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని తన సంతోషాన్ని పంచుకున్నారు.

దేవుని కోరిక మేరకు, మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా గెలిచారు. 17 సంవత్సరాల క్రితం, నేను అక్టోబర్ 10 న అధ్యక్షుడిగా గెలిచాను, అదే తేదీన, విష్ణు కూడా గెలిచాడు, ”అని మోహన్ బాబు అన్నారు. మంచు విష్ణు మీడియాతో ముచ్చ‌టించారు. మా ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మా ఎన్నిక‌ల నుంచి త‌న‌ను త‌ప్పుకోమ‌ని చిరంజీవి అన్నారని, ప్ర‌కాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు క‌దా, విష్ణుని పోటీ నుంచి త‌ప్పుకోమ‌ని చెప్పొచ్చు క‌దా అని మోహ‌న్ బాబుకు చిరంజీవి చెప్పార‌ని మంచు విష్ణు పేర్కొన్నారు. చరణ్ నాకు ఓటేసాడని చెప్పాడు. అది అబద్దమే… అతనికి చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ కే ఓటేయమని చెప్పుంటారు. అతనికే ఓటేసి ఉంటాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విష్ణు.

Mohan Babu, Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan

నిన్న పోలింగ్ బూత్ వద్ద విష్ణు- చరణ్ లు ఎంతో సన్నిహితంగా హగ్ చేసుకుని, నవ్వుకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే. మరోపక్క మోహన్ బాబు కూడా.. ఒక ఈవెంట్ లో ఉన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి. అంతేకానీ.. వేదిక దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్లు నోరు జారడం కరెక్ట్ కాదు. రోజురోజుకి వయసొచ్చే సరికి ఆలోచనతో మాట్లాడాలి. అంటూ పరోక్షంగా పవన్ పై సెటైర్లు వేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది.

 

 

 

Web Title: Mohan Babu, Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan, MAA Elections, Mohan babu speech at Vishnu press meet after winning elections.

Previous articleBigg Boss Telugu 5 Nominated Contestants List For Sixth Week
Next articleJr NTR emotional post on Mahesh Koneru passed away