HomeUncategorized‘గాడ్ ఫాదర్’ కోసం థమన్ మ్యూజిక్ సెషన్ స్టార్ట్

‘గాడ్ ఫాదర్’ కోసం థమన్ మ్యూజిక్ సెషన్ స్టార్ట్

GodFather, Thaman: మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ ఫిలిం ఈపుడు షూట్ దశలో వుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో పూర్తయింది. తాజా షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేశారు. దర్శకుడు మోహన్ రాజా ఇప్పుడు సినిమా పాటలను ఖరారు చేస్తున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు తమన్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి. దర్శకుడు రాజా, సంగీత దర్శకుడు థమన్ మరియు సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా మ్యూజిక్ సెషన్‌లో చర్చించుకుంటున్న కొత్త ఫోటోను మేకర్స్ విడుదల చేశారు.

‘గాడ్ ఫాదర్’ మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్. రాజకీయాల్లో చిరంజీవి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్ (అతిధి పాత్రలో) మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఉన్నారు.

Also Read: చై-సామ్ విడాకుల పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..! 

Music Session for Chiranjeevi GodFather is in full swing

చిరంజీవి పుట్టినరోజున టైటిల్ ను రివీల్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో చిరంజీవికి తల్లిగా గంగవ్వ నటించే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్, ఆర్‌బి చౌదరి సంయుక్తంగా రామ్ చరణ్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

- Advertisement -

 

Web Title: Music Session for Chiranjeevi GodFather is in full swing

Related Articles

Telugu Articles

Movie Articles