Samantha and Naga Chaitanya head for a divorce: సమంత మరియు నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోయినట్లు ప్రకటించారు. కష్ట సమయాల్లో వారికి మద్దతు అందించడానికి వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘‘మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం.
పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’
నాగచైతన్య-సమంత కలిసి ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో నటించారు ‘ఏమాయ చేసావె’ వారి తొలి చిత్రం కాగా, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ ‘మజిలీ’ చిత్రాల్లో కలిసి వెండితెరను పంచుకున్నారు. సమంత నటించిన ‘ఓ బేబీ’లో నాగచైతన్య అతిథి పాత్రలో మెరిశారు.