నాగశౌర్య ఫామ్ హౌస్ పై పోలీస్ రైడ్.. బయటపడ్డ నిజాలు

Naga Shaurya: టాలీవుడ్ లో హీరో నాగ శౌర్య కష్టపడి పైకి వచ్చిన విషయం అందరికీ తెలిసినదే. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ గా చేస్తున్నాడు. వరుడు కావలెను ఈ సినిమాతో మంచి హిట్ సంపాదించుకున్నాడు.

షాకింగ్ సంఘటన ఏమిటంటే, టాలీవుడ్ యువ హీరో నాగశౌర్యకు చెందిన ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమాజంలో చెప్పుకోదగ్గ వ్యక్తులుగా చెబుతున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే ఓ ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు.

పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఆ ఫార్మ్ హౌస్ హీరో నాగ శౌర్య అని తెలిసింది. ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ పేకాట వెనుక గుత్తా సుమన్‌ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మోహన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్, చాట్ డేటాను పరిశీలిస్తున్నారు.

Also Read: ఇకపై ఆ చిన్నారుల్ని నేను చదివిస్తా: పునీత్ కి మాట ఇచ్చిన విశాల్‌ 

Naga Shaurya farmhouse raided cash and poker chips found

ఈ ఇష్యూలో శౌర్య బాబాయి బుజ్జి పేరు బయటకు రావడంతో హీరో శౌర్య, సుమన్ మధ్య ఉన్న అనుబంధంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్న వారిని రిమాండ్‌కు పంపుతామని పోలీసు అధికారి తెలిపారు.

 

Web Title: Naga Shaurya farmhouse raided cash and poker chips found, young hero farm house raided, gambling in the farm house, Naga Shaurya movies,

Related Articles

Telugu Articles

Movie Articles