వీరాభిమానికి ప్రభాస్ ఖరీదైన బహుమతి..!

Prabhas: ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కి అదే ఫాలోవర్స్ కి అమితమైన ప్రేమ. ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన రాబోయే సినిమా రాదే శ్యాం జనవరి 14వ తారీఖున రిలీజ్ అవ్వడానికి అంతా సిద్ధం చేసి పెట్టారు. అలాగే ప్రభాస్ కి ఎవరైనా కలిసి తన దగ్గరికి వెళ్ళినా గిఫ్ట్ ఇవ్వటం అలవాటు.

ఇప్పుడు అలాంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఓ అభిమాని ప్రభాస్‌కి షాక్చిచే రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన తలపై ప్రభాస్ అనే అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అది చూసిన ప్రభాస్ సంతోషంగా తనే హక్కుని అలాగే కాసేపు ముచ్చటించి, ఫ్యాన్ కి ఖరీదైన వాచ్ బహుమానంగా ఇచ్చాడు.

గతంలో కూడా పలువురు అభిమానులకు ఇలాగే గిఫ్ట్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ వీరాభిమాని ఫోటో, ప్రభాస్ అతడికి అందచేసిన గిఫ్ట్ వాచ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Prabhas Gifts Expensive Watch to Die-hard Darling Fan
Prabhas Gifts Expensive Watch to Die-hard Darling Fan

ఇక సినిమా విషయానికొస్తే ప్రభాస్ వరుసగా ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటారు. వీటిలో ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే ఏడాది ఆగష్ట్ 11న విడుదల కాబోతోంది.

Related Articles

Telugu Articles

Movie Articles