15 నిమిషాల క్లైమాక్స్ కి 50 కోట్లు ఖర్చు..!

0
420
Prabhas Radhe shyam 50 crores spend for a 15 minute climax

Prabhas Radhe Shyam climax: డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాల్ని ప్రారంభించాడు. రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో రిలీజవుతుండగా.. సలార్ -ఆదిపురుష్ 3డి చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. జనవరి 14, 2022 ఈ చిత్రం భారీగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. మేకర్స్ కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఖర్చు చేశారని తాజా సమాచారం. అంతేకాదు ఈ క్లైమాక్స్ దాదాపు 15 నిమిషాల పాటు ప్రదర్శించబడుతుందని మరియు ప్రేక్షకుల మనసులను కదిలించబోతోందని అంటున్నారు.

Prabhas Radhe shyam 50 crores spend for a 15 minute climax

Also Read: Prabhas Radhe Shyam’s teaser to be out on this date

యాక్షన్ సన్నివేశాలు అసాధారణంగా ఉంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అలాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి అంట. ఇందులో సీనియర్ నటుడు కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించారు. పరమహంస పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది.

 

 

Web Title: Prabhas Radhe shyam 50 crores spend for a 15 minute climax, Radhe Shyam Teaser Date, Movie Release date, Pooja Hegde, Prabhas Upcoming movies.

Previous articlePrabhas Radhe Shyam’s teaser to be out on this date
Next articleకార్తికేయ ‘రాజా విక్ర‌మార్క‌’ విడుదల డేట్ ఫిక్స్