రొమాంటిక్ ట్రైలర్ అదిరిందంతే!

0
344
Prabhas unveils 'Romantic' trailer featuring Akash Puri and Ketika Sharma

Romantic Trailer: పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి రాబోయే చిత్రం రొమాంటిక్. రొమాంటిక్ డ్రామాలో కేతికా శర్మ హీరోయిన్ చేస్తుంది. రొమాంటిక్ అక్టోబర్ 29 న విడుదల చేయడానికి సిధం చేసారు. మేకర్స్ ఈరోజు ప్రభాస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

పూరీ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలను చేశాడు. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వస్తున్నాడు.

టైటిల్‌కి అనుగుణంగా, రొమాంటిక్ ట్రైలర్‌లో ప్రధాన జంట మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ లో చెప్పిన రమ్యకృష్ణ మాటలే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది చెప్తుంది. ఈ కాలంలో ఆడ, మగ మధ్య మొహానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటున్నారు. కానీ.. ఇందులో హీరో, హీరోయిన్లు ప్రేమనే మొహమనే భ్రమలో ఉన్నారు. నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్..

Prabhas unveils 'Romantic' trailer featuring Akash Puri and Ketika Sharma

ఈ సినిమాకి పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే మరియు మాటలు రాశారు అలాగే పూరి కనెక్ట్స్ పతాకంపై ఛార్మి కౌర్‌తో పాటు ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు . రొమాంటిక్ సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ఎటు చూసినా అన్నీ పాజిటివ్ గానే కనిపిస్తున్న ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

 

 

Web Title: Salaar Star Prabhas Launch Akash Romantic Trailer, Prabhas unveils ‘Romantic’ trailer featuring Akash Puri and Ketika Sharma, Romantic Release date, Ketika Sharma hot

Previous articleMaha Samudram 5 Days Box office Collections
Next articlePooja Hegde Photos From Most Eligible Bachelore