ప్రగ్యా జైస్వాల్ కి మళ్లీ కరోనా..!

0
470
Pragya Jaiswal Confirmed tested COVID 19 Positive again

Pragya Jaiswal COVID Positive : నటి ప్రగ్యా జైస్వాల్ తనకు కోవిడ్ 19 పాజిటివ్ అని పరీక్షించినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రగ్యాకు ఇంతకు ముందు వైరస్ సోకింది అలాగే ఆమె ఇన్ఫెక్షన్ బారిన పడటం ఇది రెండోసారి.

ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఇంత‌క‌ముందు క‌రోనా బారిన ప‌డ్డాను. ఇప్పడు మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చింది.

ప్ర‌స్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. గత 10 రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి’ అని ప్రగ్యా సూచించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్య సరసన అఖండ సినిమా లో హీరోయిన్‍గా నటిస్తోంది.

Pragya Jaiswal Confirmed tested COVID 19 Positive again

ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా.. ఇటీవలే ఈ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

 

Web Title: Pragya Jaiswal Confirmed tested COVID 19 Positive again, Pragya Jaiswal Corona virus positive, Pragya Jaiswal movies, Pragya Jaiswal AKhanda stills,

Previous articleరాజ్ తరుణ్ , సందీప్ మాధవ్  మల్టిస్టారర్ “మాస్ మహారాజు” ప్రారంభం
Next articleSampadaah nagesh at Mass Maharaju Film Launch Photos