Allu Arjun Varudu Kaavalenu: యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా ఫ్యామిలీ డ్రామా వరుడు కావలెను. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్గా చేస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అలా సినిమా మీద మంచి హైప్ ఏర్పడటంతో చిత్రయూనిట్ కూడా రకరకాల ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా ఈనెల 27న ఈ సినిమాకు సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హైదరాబాద్‌లో జరగనున్న వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు.
ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.
ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తుండగా… నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.