పుష్ప నుండి శ్రీ వ‌ల్లి ప్రోమో సాంగ్ విడుద‌ల‌..!

0
881
Allu Arjun Pushpa Second Single Srivalli Promo released

Pushpa Srivalli Songs: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. మొదటి భాగం పుష్ప ది రైస్ ను డిసెంబర్ 17 వ తేదిన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. రెండో పాటకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే గీతాన్ని తెలుగులో సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు.

పూర్తిగీతం ఈ నెల 13న విడుదలకానుంది. ఈ పాటను నాలుగు బాషల్లో సిద్ శ్రీరామ్ పాడగా, హిందీ లో మాత్రం జావేద్ అలీ పాడటం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మళయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుంది.

Allu Arjun Pushpa Second Single Srivalli Promo released

ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

 

 

 

Web Title: Pushpa Second Single Promo released, Rashmika as a Srivalli second song from Pushpa part 1, Allu Arjun and Skumar Pushpa The Rise songs, Full Song

Previous articleRam Charan whopping remuneration for Shankar RC15
Next articleSai Tej Republic 10 Days collections