భారీ రేటుకు అమ్ముడైన “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్

0
700
Radhe Shyam overseas rights sold to Great India Films

రాధా కృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.

అందులో భాగంగానే “రాధే శ్యామ్” టీమ్ రేపు టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్స్ ప్రారంభిస్తారు. “రాధే శ్యామ్” టీజర్ రేపు ఉదయం 11:16 గంటలకు విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ము డయ్యాయి.

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 22 కోట్లకు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు దక్కించుకున్నారట. వారు యూఎస్ఏ, కెనడాలో భారీ రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారట. అలాగే ఈ చిత్ర కర్ణాటక హక్కులను స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది.

Radhe Shyam overseas rights sold to Great India Films

“రాధే శ్యామ్” యూఎస్ ప్రీమియర్‌లు 13 జనవరి 2022 న ప్రదర్శితం అవుతాయి. కాగా “రాధే శ్యామ్” 2022 జనవరి 14న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.యువి క్రియేషన్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా బ్యాంక్రోల్ చేసిన ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు సమర్పిస్తున్నారు.

 

 

Web Title: Radhe Shyam Overseas Rights Sold, Radhe Shyam movie rights, Prabhas, Pooja Hegde, Radhe Shyam release date, Radhe Shyam Teaser and Trailer

Previous articleVarun Tej Ghani first single on this date
Next articleSarkaru Vaari Paata wraps up music work; All set for the first single release