రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్  మల్టిస్టారర్ “మాస్ మహారాజు” ప్రారంభం

0
59
Raj Tarun Mass Maharaju New Movie Launch Photos

స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ , సిమ్రత్, సంపద హీరో,హీరోయిన్లుగా సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో ఎం.అసిఫ్ జానీ నిర్మిస్తున్న నూతన చిత్రం “మాస్ మహారాజు” .ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపు కుంది.

చిత్ర దర్శకుడు సి.హెచ్.సుధీర్ రాజు మాట్లాడుతూ .. స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆషిఫ్ జానీ ప్రొడ్యూసర్ గా “మాస్ మహారాజు” చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా సిమ్రత్, సంపద హీరోయిన్లుగా మూవీస్ స్టార్ట్ చేస్తున్నాం .మనకు సూర్యచంద్రులు ఒకరి కోసం ఒకరు ఎలా వస్తూ వెళ్తున్నారో ఈ సినిమాలో వీరిద్దరూ ఒకరి కోసం, ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. ఫ్రెండ్షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా సినిమా ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ  సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.

చిత్ర నిర్మాత ఎమ్.అసిఫ్ జానీ మాట్లాడుతూ .. మొట్ట మొదటిగా నేను తీస్తున్న ఈ సినిమాకు అందరూ వచ్చి బ్లెస్స్ చేసినందుకు మా ధన్యవాదాలు. నేను సినిమా మొదలు పెట్టినప్పుడు నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు.  రాజా రవీంద్ర గారు కలసి మాకు సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్పడంతో ఈ రోజు సినిమా గ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. మేము తీస్తున్న ఈ సినిమా అందరినీ తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని అన్నారు.

Raj Tarun Mass Maharaju New Movie Launch Photos

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ .. వంగవీటి, జార్జిరెడ్డి తర్వాత మంచి పవర్ ఫుల్ కథ చెప్పిన డైరెక్టర్ సుధీర్ వర్మ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది.
అజయ్ విన్సెంట్ కెమెరామెన్ గా, మణి శర్మ గారు సంగీత దర్శకుడుగా ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అందరు ప్రేక్షకులను ఈ సినిమా ఆలరిస్తుంది. మంచి టైమింగ్ తో ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫ్రెండ్షిప్ లో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాత ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్తో తీస్తున్నారు.ఈ సినిమా గురించి నిర్మాత కలిసినప్పుడు ఇందులో సందీప్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే సినిమా చాలా బాగుంటుందని సినిమాపై నమ్మకం వచ్చింది. సినిమాను త్వరలో షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి త్వరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Raj Tarun Mass Maharaju New Movie Launch Photos

హీరోయిన్ సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ ..ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు.ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ సంపద మాట్లాడుతూ… తెలుగులో వస్తున్న నా మొదటి సినిమా ఇది. రాజ్ తరుణ్, సందీప్ వంటి సీనియర్ల దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ..  దర్శకుడు సుధీర్ రాజు చెప్పిన “మాస్ మహారాజు” కథ బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి కథ వినలేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్ర నిర్మాత చాలా చిన్న వయసులో వ్యాపారంలో సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నాడు.

Raj Tarun Mass Maharaju New Movie Launch Photos

ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. కొత్తనటులను ఎంకరేజ్ చేసే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్లు కి మనమందరం సపోర్ట్ చేయాలి. రాజ్ తరుణ్, సందీప్ ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ కథ చాలా వెరైటీగా ఉంది. మంచి ఐడియాతో వస్తున్న ఈసినిమా తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

ఫైట్ మాస్టర్ జోషువా మాట్లాడుతూ ..సుధీర్ గారు నాకు ఈ కథ కొత్తగా చెప్పాడు కొత్త యాక్షన్ తో, సినిమాను కొత్త గా డిజైన్ చేశాడు.ఈసారి యాక్టిన్ సీన్స్  కొత్తగా ఉండేలా మేము ప్రయత్నం చేస్తున్నాం.ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందని మీరు చూస్తారని అన్నారు.

Cast Crew:
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ , సిమ్రత్ కౌర్, సంపద , రాజా రవీంద్ర, సాయి కుమార్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చరవి, చంటి తదితరులు

 

 

Web Title: Raj Tarun Mass Maharaju New Movie Launch, Mass Maharaju Movie Launch Photos, Mass Maharaju cast crew details, Hot beauty Simrat Kaur

Previous articleపోస్ట్ ప్రొడక్షన్ దశలో స‌త్య‌దేవ్‌ స్కైలాబ్‌
Next articleప్రగ్యా జైస్వాల్ కి మళ్లీ కరోనా..!