రాజా విక్రమార్క మూవీ రివ్యూ

0
2946
kartikeya Raja Vikramarka Review In Telugu

Raja Vikramarka Review In Telugu
రేటింగ్ : 2.25/5
న‌టీన‌టులు: కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ల భరణి, సాయి కుమార్
దర్శకుడు – శ్రీ సారిపల్లి
నిర్మాత – రామారెడ్డి
బ్యానర్ – శ్రీ చిత్ర మూవీ మేకర్స్
సంగీతం – ప్రశాంత్

ఆర్ఎక్స్ 100’తో హీరో కార్తికేయ గుమ్మకొండ భారీ విజయం అందుకున్నారు. విజయంతో పాటు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు నటుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చినా… కమర్షియల్ లెక్కల పరంగా ఆశించిన విజయాలు అందుకోలేదు. శ్రీ సారిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన రాజా విక్ర‌మార్క ఈరోజు విడుద‌ల చేసారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచింది ఇప్పుడు చూద్దాం.

కథ:
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందాన్ని లీడ్ చేసే అధికారి (తనికెళ్ల భరణి) విక్రమ్ ( గుమ్మకొండ కార్తీకేయ) టీమ్ మెంబర్. హోంమంత్రి ఇంటిలో అండర్ కవర్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ క్రమంలో హోం మంత్రి కూతురు కాంతి (తాన్యా)తో ప్రేమలో పడుతాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలనుకొనే టెర్రిరిస్టులపై దాడి చేస్తారు. కీలక టెర్రరిస్టు వద్ద కుట్రకు సంబంధించిన సగం సమాచారాన్ని తీసుకొని చంపేస్తాడు.కిడ్నాప్ వెనుక ఉన్న నిందితుడు ఎవరు, మరియు వారి ఉద్దేశ్యం ఏమిటి? హోంమంత్రి కుమార్తెను విక్రమార్క కాపాడగలడా? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

Raja Vikramarka Movie Review

ప్ల‌స్ పాయింట్స్
కార్తికేయ న‌ట‌న‌
ఎడిటింగ్
ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్

మైన‌స్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
కిడ్నాప్ కథ

నటీనటులు:
వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న కార్తికేయ రాజా విక్ర‌మార్క చిత్రంలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కొన్ని సమయాల్లో అతని పాత్ర యొక్క తెలివితక్కువతనం ఎప్పుడూ అమాయకంగా మరియు అజ్ఞానంగా ఉండలేని సీక్రెట్ ఏజెంట్ పాత్రతో కలిసిపోదు. అతని కామెడీ బలవంతంగా కనిపిస్తుంది మరియు హీరోయిన్‌తో కెమిస్ట్రీ పని చేయలేదు.

కార్తికేయ తర్వాత సుధాకర్ కొమాకులది ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించారు. మొదట అండర్ ప్లే చేసి… క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత యాక్టింగ్‌లో వేరియేష‌న్‌ చూపించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, తాన్య‌, సుధాక‌ర్ కోమాకుల త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ న్యాయ చేశారు. మిగతా పాత్ర‌లు ఇలా వ‌చ్చి అలా వెళ్లిన‌ట్టుగానే ఉన్నాయి.

Raja Vikramarka Movie Review

విశ్లేషణ:
ఎన్.ఐ.ఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)… ఇప్పటివరకూ తెలుగు తెరపై ఎన్.ఐ.ఎ ఏజెంట్స్ అంటే తీవ్రవాదుల మీద చేసే పోరాటాన్ని చూపించారు. దేశం లోపల కూడా ఎన్.ఐ.ఎ ఏజెంట్స్ పని చేస్తారని ‘రాజా విక్రమార్క’లో చూపించారు. దర్శకుడు శ్రీ సరిపల్లికి టెక్నికల్ టీమ్ నుంచి సూపర్బ్ సపోర్ట్ లభించింది. పీసీ మౌళి సినిమాటోగ్రాఫీ బావుంది. ప్రతి ఫ్రేమ్ చాలా స్ట‌యిలిష్‌గా, రిచ్‌గా తీశారు. ఆ సన్నివేశాలకు ప్రశాంత్ ఆర్. విహారి చక్కటి నేపథ్య సంగీతం అందించారు.

ముందుగా చెప్పాలంటే, రాజా విక్రమార్కలోని ప్రేమకథ చాలా పాతది, జంట ఒకరికొకరు పడే పాటలోని ఫ్రేమ్‌లు మరియు నటనలను మనం అంచనా వేయవచ్చు. హీరో తన ముక్కుసూటి స్వభావంతో ఆకట్టుకోవడం మరియు ఆమె ఎప్పుడూ సందర్శించాలనుకునే ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లడం పాతకాలపు ఫార్ములా. లవ్ ట్రాక్ సినిమాని డౌన్ చేసింది.

సాయి కుమార్, తనికెళ్ల భరణి, పశుపతిల నటనలో అనుభవం కనిపించింది. హర్షవర్ధన్ కామెడీ టైమింగ్ బావుంది. అయితే… ఆయనపై తీసిన సన్నివేశాలు, ఆ ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్స్ గతంలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వేట మొదలైన తర్వాత ప్రేక్షకులకు మజా మొదలవుతుంది. కానీ ముందు వచ్చే స్టొరీ మనకు తెలిసిపోతుంది. రాజా విక్రమార్క లాజిక్ లేని యాక్షన్ థ్రిల్లర్.కార్తికేయ ప‌ర్‌ఫార్మెన్స్ త‌ప్ప సినిమాలో ఏ కోణం న‌చ్చ‌దు.లాజిక్‌లేని ట్విస్ట్‌లు బోర్ కొట్టిస్తాయి.

 

Web Title: రాజా విక్రమార్క మూవీ రివ్యూ, Raja Vikramarka Review In Telugu, Raja Vikramarka Movie Review Rating, Telugu movie Raja Vikramarka Review, Kartikeya Raja Vikramarka Review.

Previous articleRaja Vikramarka Movie Review
Next articleActress Poorna Latest Stills