రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత.!

0
52
rajinikanth admitted in hospital and responds his wife latha

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రొటీన్ చెకప్ కోసం చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ అడ్మిట్ కావాల్సి వచ్చింది. సినిమా రంగానికి చేసిన కృషికి గాను గౌరవనీయమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించడానికి కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీకి వచ్చిన దర్బార్ నటుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు.

రజనీకాంత్ రక్తనాళం పగిలిందని ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలిందని వార్తలు వస్తున్నాయి. గురువారం రాత్రి రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు వచ్చారు. ఇక కాసేపట్లో రజినీ హెల్త్ బులెటివన్ విడుదల చేయనున్నారు వైద్యులు.

ఈ క్రమంలో తాజాగా రజినీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు. సాధారణ హెల్త్ చెకప్‏లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని.. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.. ప్రతి సంవత్సరం ఇలా సాధారణ ఆరోగ్య పరీక్షులు చేస్తారని తెలిపారు.

rajinikanth admitted in hospital and responds his wife latha

Also Read: రజినీ పై నటి సంచలన కామెంట్స్..!

ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో పెద్దన్న’ అనే టైటిల్ తో కూడా విడుదల చేయబోతున్నారు.

 

Web Title: Rajinikanth admitted in hospital, rajinikanth health condition, Rajinikanth wife responds on health condition, annaatthe actor Rajinikanth

Previous articleUnstoppable With Balakrishna: Actor Nani Chief Guest
Next articleవిడుదలకు సిద్ధమైన స‌త్య‌దేవ్‌ స్కైలాబ్‌’ ట్రైలర్..!