Rana Aranya ZEE5 OTT Release: రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకుడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దసరా కానుక అక్టోబర్ 15 నుంచి జీ5 (ZEE5 OTT) వేదికగా ఈ సినిమా ప్రసారం కానుంది.
విశాఖ సమీపంలోని చిలకలకోన అడవి. అక్కడ తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు నరేంద్ర భూపతి (రానా). ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా కట్టేస్తాడు. మరి అడవినే నమ్ముకున్న ఏనుగులు, అరణ్య… కేంద్రమంత్రిపై ఎలా పోరాటం చేశారు?అడవిని ఎలా దక్కించుకున్నారన్నది కథ.
అడవి, ఏనుగుల రక్షణ కోసం పాటు పడుతున్నందుకు రానాకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి పురస్కారం కూడా లభిస్తుంది. ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రలు పోషించారు.
Also Read: ‘ఆహా’కి మూడు కొత్త చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్