ఆస్పత్రి నుంచి సాయిధరమ్‌ తేజ్‌ డిశ్చార్జ్‌..!

0
301
Chiranjeevi and Pawan Kalyan tweeted Sai Dharam Tej discharged from hospital

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు సెప్టెంబర్ 10వ తారీఖున హైదరాబాద్ లో బైక్ పైన వెళ్తుంటే యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు (Chiranjeevi) వెల్లడించారు. శుక్రవారం సాయితేజ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన విషెస్‌ చెప్పారు.

కాలర్ బోన్ ను ఆపరేట్ చేసిన వైద్యులు తేజ్ (Sai Dharam Tej) కు విశ్రాంతిని ప్రకటించారు. అప్పటినుండి హాస్పిటల్ లోనే ఉన్న తేజ్, ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ కు అనుమతిచ్చారు. అయితే తేజ్ మరో 3-4 నెలలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాడని తెలుస్తోంది.

‘విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. అది ఏమిటంటే.. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో నేడు ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్‌’..’’ అని చిరంజీవి తెలిపారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేస్తూ.. అనుకోని ప్రమాదంలో గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్.. ఈ రోజు ఇంటికి చేరారన్నారు. విజయ దశమి పర్వ దినం రోజు సాయి ధరమ్ తేజ్ ఇంటికి చేరడం మా కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్.. పుట్టినరోజు. ఇలాంటి బర్త్ డేలు సాయి ధరమ్ తేజ్ మరిన్ని జరుపుకోవాని ఆ శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.

Chiranjeevi and Pawan Kalyan tweeted Sai Dharam Tej discharged from hospital

Also Read: వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దసరా పండగ రోజు అదిరిపోయే శుభవార్త వచ్చిందని, ఆయన పుట్టిన రోజు నాడే డిశ్చార్జి కావడం సంతోషంగా ఉందన్నారు.

 

Web Title: Pawan Kalyan Tweeted Sai Dharam Tej has reached home safe thanks for all your prayers, Sai Dharam Tej discharged from hospital, Chiranjeevi tweeted.

Previous articleSamantha announces bilingual film with director Shantaruban
Next articleSurya Jai Bhim Teaser Out Now