సాయిధరమ్ తేజ్ ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడా?

0
39378
Sai Dharam Tej Marry Brazilian Model And Heroine Larissa Bonesi

Sai Dharam Tej Love: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. బైక్ పై వెళుతూ ప్రమాదవశత్తూ కిందపడ్డాడు. సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు (Chiranjeevi) వెల్లడించారు. శుక్రవారం సాయితేజ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన విషెస్‌ చెప్పారు.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఈ ఏడాది సాయితేజ్ పెళ్లి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది వ‌ర‌కు సాయిధ‌ర‌మ్ ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. ఆమె ఎవ‌రో కాదు.. లారిస్సా బోనెసి. బ్రెజిలియ‌న్ మోడ‌ల్‌.. హీరోయిన్‌. లారీసా తేజతో కలసి తిక్క చిత్రంలో నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనెసి నిజంగానే ప్రేమించుకున్నారా? ఏంటి అనిపిస్తుంది. అందుకు కార‌ణం.. లారిస్సా బోనెసి పెడుతున్న ట్వీట్స్‌. సాయితేజ్ రిప‌బ్లిక్ మూవీ విడుద‌ల స‌మ‌యంలో నాతేజు న‌టించిన రిప‌బ్లిక్ ఈరోజు విడుద‌లవుతుంది అంటూ ట్వీట్ చేస్తూ ల‌వ్ సింబ‌ల్‌ను పోస్ట్ చేసిన లారిస్సా..రీసెంట్‌గా ఐ మిస్ యు తేజ్ అంటూ రీసెంట్‌గా ట్వీట్ చేసింది.

Also Read: Prabhas to charge a whopping remuneration for Spirit

Sai Dharam Tej Marry Brazilian Model And Heroine Larissa Bonesi

ఒక‌వేళ ఇది నిజ‌మైతే, మ‌రి సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనెసిని పెళ్లి చేసుకుంటాడా? మరి మెగా కాంపౌండ్ ఈ వార్త‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

 

 

Web Title: Sai Dharam Tej Marry Brazilian Model And Heroine Larissa Bonesi, Larissa Bonesi marriage wiht Sai dharam tej, Larissa Bonesi photos, Larissa Bonesi tweets on Sai tej.

SOURCEtelugu samayam
Previous articleవిద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్
Next articleEvaru Meelo Koteeswarulu: Thaman & DSP Comes Together For Jr NTR