పవన్ శేఖర్ కమ్ముల కాంబోలో పొలిటికల్ మూవీ?

0
1012
Sekhar Kammula plans intense political drama with Pawan Kalyan Pawan Kalyan, Sekhar Kammula

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ ఆసక్తికరంగా మారుతోంది. అటు పాలిటిక్స్, ఇటు మూవీస్ బ్యాలన్స్ చేస్తున్న పవన్ వరుసగా సినిమాలకు ఓకె చెబుతున్నారు. ప్రస్తుతం Bheemla Nayak, హరిహర వీరమల్లు చిత్రాల్లో పవన్ నటిస్తున్నాడు. అలాగే హరీష్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది.

ఇవి కాక మరో ఇద్దరు దర్శకులు Pawan Kalyan తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లవ్ స్టోరీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల పవన్ హీరోగా లీడర్ మూవీకి సీక్వెల్ ను తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. లీడర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఈ కథ పవన్ ఇమేజ్ కు బాగా సరిపోతుందని శేఖర్ కమ్ముల నమ్ముతున్నారట.

Sekhar Kammula plans intense political drama with Pawan Kalyan Pawan Kalyan, Sekhar Kammula

ఈ కథలో పవన్ నటిస్తే మెసేజ్ బలంగా ప్రజల్లోకి వెళుతుందని.. అది పవన్ పొలిటికల్ కెరీర్ కు కూడా ఉపయోగపడుతుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నారు. పవన్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

 

Web Title: Sekhar Kammula plans intense political drama with Pawan Kalyan Pawan Kalyan, Sekhar Kammula, Anil Ravipudi, Bheemla Nayak, Hari Hara Veera Mallu, Bhavadeeyudu Bhagat Singh

Previous articleచిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్ లాంచ్ చేసిన చరణ్‌
Next articleAkash Puri’s Romantic Grand Release Worldwide On October 29th