రాజమండ్రిలో ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు షూటింగ్..!

0
140
sharwanand and rashmika mandanna shooting for aadavallu meeku joharlu movie at rajahmundry

Aadavallu Meeku Joharlu Shooting: శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

శర్వా, రష్మిక తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంతకు ముందు కొంత చిత్రీకరణ చేశారు. నేడు ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైంది. దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తి కానున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా శర్వానంద్‌తో సెల్ఫీ తీసుకున్నారు రష్మికా మందన్నా. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పల్లెటూరి నేపథ్యంలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

sharwanand and rashmika mandanna shooting for aadavallu meeku joharlu movie at rajahmundry

ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో శర్వానంద్ మొదటిసారిగా రష్మిక మందన్నా, కిషోర్ తిరుమలతో కలిసి పని చేస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నారు. రష్మిక అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. టైటిల్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తోంది.

Also Read: RRR & పవన్ & మహేష్ సినిమాలపై రాధేశ్యామ్ ప్రభావం ఉందా..? 

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో రాధికా శరత్ కుమార్, ఖుష్భూ, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘వెన్నెల’ కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అందరి పాత్రలు ఇంపార్టెన్స్ ఉంటుందట.

 

 

Web Title: sharwanand and rashmika mandanna shooting for aadavallu meeku joharlu movie at rajahmundry, aadavallu meeku joharlu movie, cast crew, HD posters

Previous articleRRR & పవన్ & మహేష్ సినిమాలపై రాధేశ్యామ్ ప్రభావం ఉందా..?
Next articleమాస్టర్ చెఫ్ ప్రోగ్రాం పై కేసు పెట్టిన తమన్నా..!