పంచతంత్రం టీజర్ విడుదల చేసిన టీమ్..!

0
25
Super response to swathi reddy Panchathantram Teaser

Panchathantram Teaser: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో సినిమా విడుదల కానుంది. లహరి ఆడియో ద్వారా పాటలు విడుదల కానున్నాయి. బుధవారం టీజర్ విడుదల చేశారు.

దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ “ఈ సినిమా ఒక అమ్యూజ్‌మెంట్‌ పార్క్ లాంటిది. టికెట్ తీసుకుని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు వెళితే డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. అలాగే, మా సినిమాలో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. ప్రతి అరగంటకు ప్రేక్షకుల్ని కొత్త రైడ్ కి తీసుకువెళతాం. నేను కథ రాయడం ప్రారంభించిన తర్వాత నాకు అండగా నా వెనుక ఉన్నది మా నిర్మాత అఖిలేష్.

మా ఇద్దరికీ ఇది తొలి సినిమా. ఎటువంటి డౌట్స్ లేకుండా షూటింగ్ కు వెళ్లాం. స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాక… మా చేతిలో ఓ బంగారు ఆభరణం మా చేతిలో ఉన్నట్టు ఉంది. దానికి డైమండ్ సెట్స్ కావాలి. ఆ డైమండ్స్ మా సినిమాలో నటించిన యాక్టర్స్. అందరూ ఫెంటాస్టిక్ పీపుల్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి సహకరించిన టెక్నికల్ టీమ్ కి థాంక్స్. మేం అడిగిన వెంటనే టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన సత్యదేవ్ గారికి థాంక్స్. త్వరలో థియేటర్లలో మా సినిమా విడుదల కాబోతుంది” అని అన్నారు.

Swathi Reddy, Samuthirakhani Panchathantram Teaser

Also Read:క్రేజీ ప్రాజెక్ట్స్ శాటిలైట్ రైట్స్ ‘స్టార్ మా’ కైవసం!

నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

 

Web Title: Panchathantram Teaser, Panchathantram cast crew details, Release date, Swathi Reddy next Panchathantram movie details..

Previous articleSwathi Reddy, Samuthirakhani Panchathantram Teaser
Next articleఆశిష్ ‘రౌడీ బాయ్స్’ షూటింగ్ పూర్తి.. త్వరలో విడుదల