మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ..!

Chiranjeevi, Tamannaah: మెగాస్టార్ చిరంజీవి వాట్సాప్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు భోళా శంకర్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నారు. చేతి మణికట్టుకు గాయం కారణంగా షూటింగ్ అని వాయిదా వేశారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు గా చేస్తుంది. సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ అయిన తమన్నా ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనికోసం తమన్నా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అర్థమవుతుంది.

గతంలో తమన్నా, చిరు “సైరా” చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు చిరంజీవితో జోడి కట్టడానికి తమన్నా ఓకే చెప్పిందని సన్నిహిత వర్గాల సమాచారం. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

Also Read: నాగశౌర్య ఫామ్ హౌస్ పై పోలీస్ రైడ్.. బయటపడ్డ నిజాలు 

Tamanna confirmed for Heroine in Chiranjeevi Bhola shankar

ఎక్కువ భాగం కలకత్తాలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ సంబంధించి ఈ ప్రకటన త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది. చాలా గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యువ సంగీత స్వరకర్త మహతి స్వర సాగర్ “భోళా శంకర్” కోసం సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు.

 

- Advertisement -

 

Web Title: Tamanna confirmed for Heroine in Chiranjeevi Bhola shankar, Tamannaah up coming movies, Tamannaah Remuneration for Bhola shankar, Megastar.

Related Articles

Telugu Articles

Movie Articles