Tamannaah Case: మాస్టర్ చెఫ్ తెలుగు అనే రియాల్టీ షో కు ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఎంపికయింది. హీరోయిన్గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది.
మాస్టర్ చెఫ్ తెలుగు పేరుతో జెమినీ టీవీ లో ఈ షో టెలికాస్ట్ అవుతోంది . ఇప్పుడు జెమినీ టీవీ వాళ్లు తమన్నా కి షాక్ ఇచ్చారు, షూటింగ్ కారణంగా తమన్నా పోగ్రామ్ కి సరిగ్గా అటెండ్ కావడం లేదని, తమన్నా బదులుగా అనసూయని ఫాస్ట్ గా చేశారు.
అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా హీరోయిన్ తమన్నా… మాస్టర్ చెఫ్ తెలుగు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అగ్రిమెంట్ ప్రకారం తనకు రావాల్సిన అమౌంట్ ని పూర్తిగా ఇవ్వలేదని అలాగే తమన్నా టీం దగ్గర నుండి వస్తున్న కాల్స్ ను జెమినీ టీవీ వాళ్లు అటెండ్ చేయటం లేదని తెలుస్తుంది.
Also Read: RC15: శంకర్ రామ్ చరణ్ సినిమాలో మరో హీరోయిన్..!
జెమినీ టీవీ అలాగే స్పాన్సర్లు అనుసరించిన విధానం పట్ల తమన్నా అసంతృప్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.