HomeUncategorizedగని ఆంథమ్ : అంచనాలు పెంచుతున్న వరుణ్ తేజ్ సాంగ్

గని ఆంథమ్ : అంచనాలు పెంచుతున్న వరుణ్ తేజ్ సాంగ్

Varun Tej Ghani Song: వరుణ్ తేజ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గని’. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది.

“గని ఆంథమ్” పేరుతో విడుదలైన ఈ టైటిల్ సాంగ్ అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామాకు సరిపోయేలా తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కు శ్రోతలు ఫిదా అవుతున్నారు. పాట కంటే వరుణ్ శిక్షణ విజువల్స్ పాటలో అద్భుతంగా ఉన్నాయి.

ఈ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు.

Varun tej Ghani anthem first single out now

‘గని’ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 3న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

 

 

Web Title: Ghani movie songs, Ghani anthem song is out, Varun tej Ghani movie release date, Ghani cast crew, Ghani movie budget. Ghani first single out.  Saiee Manjrekar

Related Articles

Telugu Articles

Movie Articles