ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ షూటింగ్ పూర్తి.. త్వరలో విడుదల

0
50
Ashish,  Anupama Parameswaran Rowdy Boys have wrapped up the shoot

ఆశిష్ హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో … శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం రౌడీ బాయ్స్ (Rowdy Boys)

తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). అనుప‌మ పర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. మ‌రో వైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా…

నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి వ‌స్తోన్న ప‌క్కా యూత్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రౌడీ బాయ్స్‌’. అన్ని ఎలిమెంట్స్‌ను డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష ప‌క్కాగా, చ‌క్క‌గా బ్లెండ్ చేసి సినిమాను రూపొందించారు. కాలేజ్ డేట్ నైట్ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. జానీ మాస్ట‌ర్‌గారు ఈ సాంగ్‌ను ఎన‌ర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది.

Ashish,  Anupama Parameswaran Rowdy Boys Shooting Photos

Also Read: గాడ్‌ ఫాదర్‌ కోసం తమన్‌ ప్లానింగ్ సూపర్..!

ఇప్ప‌టికే విడుద‌లైన టైటిల్ ట్రాక్‌, టీజ‌ర్‌ను ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆశిష్‌, విక్ర‌మ్‌, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ ప‌ర్ఫామెన్స్‌లు, శ్రీహ‌ర్ష టేకింగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఎక్స్‌ట్రార్డిన‌రీ సాంగ్స్ ఇచ్చాడు. అలాగే బీజీఎం నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంది.

Ashish,  Anupama Parameswaran Rowdy Boys Shooting Photos

Also Read: Maha Samudram Review and Rating

మదిగారి విజువల్స్ సింప్లీ సూపర్బ్. ఇది వ‌ర‌కు చెప్పిన‌ట్లు టైటిల్ ట్రాక్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. త్వ‌ర‌లోనే మిగిలిన సాంగ్స్‌ను రిలీజ్ చేస్తాం. పోస్ట్ ప్రొడక్ష‌న్‌ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

Ashish,  Anupama Parameswaran Rowdy Boys Shooting Photos

 

 

Web Title: Ashish,  Anupama Parameswaran Rowdy Boys have wrapped up the shoot and ready to release, Rowdy Boys cast crew, Release date, Rowdy Boys Teaser,

Previous articleపంచతంత్రం టీజర్ విడుదల చేసిన టీమ్..!
Next articleమహా సముద్రం రివ్యూ & రేటింగ్