రాక్షసుడు V/S గుణ

Telugu Up Coming Movies Rakshasudu VS Guna 369 Previews, Reviews
Telugu Up Coming Movies Rakshasudu VS Guna 369 Previews, Reviews

టాలీవుడ్ లో తయారయ్యే సినిమాల సంఖ్య ఎక్కువ.కాబట్టి ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి.అయితే ఈ శుక్రవారం మాత్రం ఇద్దరు హీరోల జాతకాలు తేల్చే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఇండస్ట్రీ కి వచ్చి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటికి సాలిడ్ హిట్ అందుకోలేకపోయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు,RX100 హిట్ తో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకోవాలని చూస్తున్న కార్తికేయ నటించిన గుణ 369 ఈ శుక్రవారం థియేటర్స్ లో తలపడబోతున్నాయి.

రాక్షసుడు…ఇది తమిళ్ సినిమా రాచ్చసన్ కి రీమేక్.అయితే చాలావరకు తమిళ్ వెర్షన్ లో సీన్స్ వాడుకోవడం వల్ల బడ్జెట్ చాలావరకు తగ్గింది.పైగా ఆల్రెడీ హిట్ కంటెంట్ అని ప్రూవ్ అయ్యింది కాబట్టి పెద్దగా, మార్పులు చేర్పులు లేకుండానే తెరకెక్కింది కాబట్టి,నేటివిటీ తో సంబంధం లేని థ్రిల్లర్ జోనర్ కాబట్టి రాక్షసుడు టీమ్ కాన్ఫిడెంట్ గానే ఉంది.ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బావుంది అనే టాక్ తెచ్చుకుంది.ఇప్పటివరకు మాస్ హీరో గా అన్నీ ట్రై చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కథ ని నమ్మి ఈ సినిమా చేస్తున్నాడు.అయితే గతంలో ఉన్న అతని మాస్ ఇమేజ్ ఈ సినిమా ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడుతుంది అని అంచనా.

గుణ 369…ఇది RX100 తో అన్ ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా.ఈ సినిమా పేరులోనే కాదు,సినిమాలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు అని ఈ సినిమా ట్రైలర్ చెప్పేసింది.హీరో,హీరోయిన్స్ లవ్ ట్రాక్,ఒక పవర్ ఫుల్ విలన్ ని ఢీకొట్టే పరిస్థితి రావడం,వాటిని దాటి హీరో గెలవడం అనే రొటీన్ కమర్షియల్ స్టోరీ తో తెరకెక్కుతుంది ఈ సినిమా.బోయపాటి దగ్గర పనిచేసిన అర్జున్ జంధ్యాల మేకింగ్ స్టైల్ లో కూడా బోయపాటిని ఫాలో అయిపోయాడు.

ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి హీరోలకు అత్యంత కీలకం.అయితే ఈ పోరులో ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ కే కాస్త పాజిటివ్ ఎజ్డ్ ఉంది.దానికి కారణం రాక్షసుడు తెరకెక్కిన జోనర్.రొటీన్ ప్యాట్రన్ కి భిన్నంగా ఉండడం.కానీ గుణ 369 సినిమా పక్కా మాస్.పైగా ఈ మధ్యే ఇస్మార్ట్ శంకర్ వచ్చి మాస్ ప్రేక్షకులను ఫుల్లుగా శాటిస్ఫై చేసింది.కాబట్టి మళ్ళీ మాస్ మసాలా సినిమా అంటే ఎగబడి చూసే సీన్ లేదు.పైగా RX100 తెచ్చిన క్రేజ్ లో సగం ఎగరేసుకుపోయింది హిప్పీ.మరి ఈ క్లిష్టపరిస్థితుల్లో రాక్షసుడు సినిమాని దాటి గుణ 369 హిట్ గా నిలవడం కష్టమే.