‘సోలో బ్రతుకు’కి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!

250
Solo Brathuke So Better Telugu Movie Reviews

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, హాట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రేపు విడుదల కాబోతుంది. ఇక విడుదల కాబోతున్న పెద్ద మూవీ కావడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’కు ఇండస్ట్రీలోని స్టార్లు అంతా సపోర్ట్ చేశారు. అయినప్పటికీ ఎక్కడో చిన్న అనుమానం. ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా? సినిమా ఆడుతుందా? అని. కానీ, ఆ అనుమానాలను పటాపంచలు చేస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్.

పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు టిక్కెట్టు ధరలు సవరించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ థియేటర్లు ధరలు పెంచలేదు. బహుశా లాక్‌డౌన్ తరవాత విడుదలవుతోన్న తొలి సినిమా కావడంతో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని టిక్కెట్ ధరలు పెంచి ఉండకపోవచ్చు. ఏదేమైనా ఆడియన్స్ నుంచి వస్తోన్న ఈ రెస్పాన్స్ మరిన్ని సినిమాల విడుదలకు దారి చూపిస్తోంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ విందు భోజనంలా కనిపించింది.

అందుకే వదిలి పెట్టకూడదని ముందుగానే క్యూ కట్టేశారు. అడ్వాన్స్‌గా టిక్కెట్లు బుక్ చేసేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ప్రధాన నగరాల్లోని చాలా థియేటర్లలో ఇప్పటికే తొలి రోజు అన్ని షోలకు టిక్కెట్లు బుక్ అయిపోయాయి.కాగా, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఆడియన్స్ నుంచి ఈ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.