SSMB28 పండగ అప్ డేట్ వచ్చేసింది..!!

SSMB28 Music Session start: మహేష్ బాబు (Mahesh babu) ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కామెడీ కారణంగా అలాగే అనుకోని పరిస్థితుల వల్ల షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. సర్కారు వారి పాట తిరిగి ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం అందుతుంది. అయితే మహేష్ బాబు (Mahesh babu), త్రివిక్రమ్ మూవీ అయిన SSMB28 సంక్రాంతి పండుగ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

SSMB28 movie updates
SSMB28 movie updates

సర్కారు వారి పాట సినిమా తరవాత మహేష్ బాబు (Mahesh babu), త్రివిక్రమ్ మూవీ SSMB28 చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

పండగ సందర్భంగా SSMB28 మ్యూజిక్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నట్టు తమన్ (Thaman) ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. త్రివిక్రమ్ అలాగే తమన్ (Thaman) కలిసి ఉన్న ఫోటో ఈ పోస్ట్ కి యాడ్ చేశాడు తమన్. మహేష్ బాబు SSMB28 షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం తెలుస్తుంది.

అయితే సర్కారు వారి పాట రిలీజ్ డేట్ సంబంధించి వాయిదా వేస్తారని న్యూస్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీనిపై ఎటువంటి అధికార ప్రకటన లేదా ఎంతవరకు.

Related Articles

Telugu Articles

Movie Articles