Thaman Comments on Devi sri Prasad Music for Sarileru Neekevvaru Teaser
Thaman Comments on Devi sri Prasad Music for Sarileru Neekevvaru Teaser

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నిన్న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ నటించిన 26వ చిత్రం. ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరూ’ టీజర్‌తో దుమ్మురేపుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుండి పగిలిపోయే టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మహేష్ బాబు అభిమానులకే కాక అన్నీ వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి మాస్ రోల్లో మహేష్ బాబు అప్పీరియన్స్, డైలాగ్ డెలివరీ & విజయశాంతి స్పెషల్ అప్పీరియన్స్ ఇలా “సరిలేరు నీకెవ్వరు”లో ఆకట్టుకొనే అంశాలు చాలా ఉన్నాయి.

ఫాన్స్, ఫాలోయర్స్, సినీ ప్రముఖలనుండి కూడా ప్రశంసలు వచ్చాయీ. అయితే..టీజర్ చూసి ఎంతగానో ఆనందించిన మహేష్ అభిమానులు ఆ టీజర్ మ్యూజిక్ విషయంలో మాత్రం నిరాశపడ్డారు. అలాగే దేవి శ్రీ మ్యూజిక్ మీద కామెంట్స్ స్టార్ట్ చేసారు అందరూ..

 

“మహర్షి”తోనే మహేష్ అభిమానులని బాగా బాధపెట్టిన దేవిశ్రీ కనీసం “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతోనైనా ఆకట్టుకొంటాడెమో అనుకుంటే.. కానీ నిరాశపరిచాడు. సినిమా స్టార్ట్ నుండి దేవి మీద మరియు తన మ్యూజిక్ మీద కామెంట్స్ వస్తున్న దాన్ని పంటిచుకోలేదు.. దీనికి తోడుగా తమన్ కూడా “సరిలేరు నీకెవ్వరు” టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో హ్యాపీగా ఫీల్ అవ్వలేదనుకుంటా.. అందుకే నిన్న టీజర్ అదిరింది అంటూ దర్శకుడు, హీరోని ట్యాగ్ చేసిన తమన్.. దేవి గురించి మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీనితో నెటిజెన్స్, ఫాలోయర్స్ ఇంకొచమ్ రెచ్చిపోయి కామెంట్స్ చేయటం స్టార్ట్ చేశారు..ఏదేమైనా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈమధ్యకాలంలో ఎవరికీ నచ్చటం లేదు అలాగే అంతగా బాగోవడం లేదనేది మాత్రం నిజం. మరి వేచి చూదాం రాబోయే సినిమాలు ఐనా మంచి మ్యూజిక్ ఇస్తాడేమో..