Ram Charan RC15 Songs: Thaman: రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం చిత్రబృందం ప్రకటించింది.
శంకర్ నిర్మించిన ‘వైశాలి'(ఈరం) చిత్రంతోనే తమన్ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేయడం విశేషం. “శంకర్‌గారు నిర్మించిన ‘వైశాలి'(ఈరం)కి ట్యూన్స్ ఇచినప్పుడు, ఆయన తొలి వెంటనే మ్యూజిక్ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది” అని తమన్ గుర్తు చేసుకున్నారు ఈ సందర్బంగా.
ఇప్పటికే ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ రికార్డింగ్ పనిని హైదరాబాద్‌లో.. ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు. ఈ పాటను రికార్డ్ చేయడానికి శంకర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ భారీ సాంగ్ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్‌చరణ్ కూడా భాగమయ్యారు. పాట విని చాలా ఎగ్జయిట్‌మెంట్‌కు ఫీలయ్యారు.