మెగా ఛాన్స్‌ కొట్టేసిన థమన్‌..!

341
Thaman SS Confirmed Music Director for Chiranjeevi Lucifer Remake

అనతికాలంలో మంచి పేరు సంపాదించుకున్నాడు సంగీత దర్శకుడు థమన్‌. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలకు పని చేయడమే కాకుండా అదే స్థాయిలో విజయాల్ని అందుకున్నాడీ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాంగ్స్ అందిస్తూ త‌న హ‌వా కొన‌సాగిస్తున్నాడు.. 2020లో అల వైకుంఠ‌పురంలో, ఈ ఏడాది క్రాక్ చిత్రంతో అదిరిపోయే సాంగ్స్ ను అందించి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. థమన్‌ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. చిరు హీరోగా లూసిఫర్‌ సినిమా రీమేక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు థమన్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కన్ఫామ్‌ చేశారు. ఏ కంపోజ‌ర్ కైనా ఉండే అతిపెద్ద క‌ల‌. నా క‌ల నిజ‌మ‌వుతున్న వేళ‌..మ‌న బాస్ మెగాస్టార్, ప్రియ‌మైన సోదరుడు మోహ‌న్ రాజాపై నా ప్రేమ‌ను చూపించే స‌మ‌యం అంటూ ట్వీట్ ద్వారా ఆనంద‌క‌ర క్ష‌ణాల‌ను అంద‌రితో పంచుకున్నాడు థ‌మ‌న్‌.

Thaman roped in for Chiranjeevi starrer Lucifer Remakeరాంచ‌ర‌ణ్ హీరోగా న‌టించిన బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ కు బీజీఎం అందించాడు థ‌మ‌న్‌. అంతేకాదు సైరా మోస‌న్ పోస్ట‌ర్ కు కూడా ప‌నిచేశాడు. మొత్తానికి ఈ సారి పూర్తిస్థాయిలో చిరంజీవి సినిమా కోసం ప‌నిచేస్తున్నందుకు ఆనందంలో మునిగితేలుతున్నాడు థ‌మ‌న్‌.