చిరు లూసిఫర్ కోసం సిద్దమైన తమన్

0
39
Thaman Starts Work For Chiranjeevi Lucifer Remake

chiranjeevi: Chiru153 :చిరంజీవీ సైన్ చేసిన సినిమాల్లో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కూడ ఒకటి. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆచార్య తరువాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. 

మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమా మీద మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా తమన్ ఓ ట్వీట్ వేశారు. లూసిఫర్ రీమేక్‌కు సంబంధించిన పోస్ట్ పెట్టేశారు. ఇందులో దర్శకులు, సంగీత దర్శకులు ఇద్దరూ కూడా ఉన్నారు. లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు చెప్పేశారు. మళయాలంలో మోహన్ లాల్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ కంటే ఎక్కువగానే తెలుగులో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. 

‘ఇది మన మెగాస్టార్ చిరంజీవిగారి మీద ప్రేమ చూపించాల్సిన సమయం. అభిమానులకు తప్పకుండా హై ఇచ్చే స్టఫ్ ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. గత ఐదారేళ్లుగా తమన్ మ్యూజిక్ అందించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ దుమ్ములేపుతున్నారు. చివరగా వకీల్ సాబ్ సినిమాకు తమన్ కొట్టిన నేపథ్యసంగీతం అదిరిపోయింది. అసలే బ్రూస్‌లీ సినిమా చిరు కనిపించే ఐదు నిమిషాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ చెవుల్లో మార్మోగిపోతోంది. ఆ చిత్రాల కోవలోనే మెగాస్టార్ సినిమా కూడ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు.