బాలీవుడ్‌ నటి ఆర్యా బెనర్జీ ఆత్మహత్య

420
The Dirty Picture actress Arya Banerjee found dead at South Kolkata home

బాలీవుడ్ సినిమాల్లో నటించిన బెంగాలీ నటి ఆర్య బెనర్జీ.. దక్షిణ కోల్‌కతాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నది. దక్షిణ కోల్‌కతాలోని జోధ్‌పూర్‌ పార్క్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డర్టీ పిక్చర్ సినిమాలో ఆర్య బెనర్జీ నటించింది. మూడవ ఫ్లోర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆర్య శవమై తేలింది. పోలీసులు ఆ ఇంటి తలపులు పగలగొట్టి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సితార కళాకారుడు నిఖిల్ బందోపాధ్యాయ కుమార్తె ఆర్య బెనర్జీ. డర్టీ పిక్చర్‌తో పాటు ఎల్ఎస్‌డీ- లవ్ సెక్స్ ఔర్ ధోకీ లాంటి ఇతర సినిమాల్లో ఆమె నటించింది. అంతకముందు ముంబయిలో మోడలింగ్‌ చేసేశారు. శుక్రవారం ఉదయం పనిమనిషి వచ్చి..తలుపులు కొట్టినా ఎంతకు తీయకపోవడంతో, ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో..ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో…వారు పోలీసులకు ఫోన్‌ చేశారు. ఈ ఘటనను అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్య భౌతికకాయాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ కోసం పంపారు. ఫోరెన్సిక్‌ బృందాలు ఆమె రూమ్ నుంచి ఆధారాలు సేకరించాయి. ఆర్య మృతికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సి ఉన్నది.