The Kerala Story Collection: “ది కేరళ స్టోరీ” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ విడుదల దగ్గర నుంచి ఈ సినిమా చుట్టూ అనేకమైన వివాదాలు కొనసాగుతూనే. ఆదాశర్మ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల (Collection) జోరు ఏమాత్రం తగ్గలేదు. కేరళలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తీయటం జరిగింది దర్శకుడు. మన సమాజంలోని ఒక కులమైన ముస్లిం వర్గాన్ని తీసుకొని వాళ్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నతి అంటూ ఈ సినిమాపై ప్రచారాలు కూడా జరిగాయి.
The Kerala Story box office Collection: సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు రోజులు (Day 2 collection) గాను 16 కోట్లను వసూలు చేయటం అందర్నీ ఆశ్చర్యానికి కలగజేసింది. మొదటి రోజు (Day 1) ఈ సినిమా 8 కోట్ల చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. “ది కేరళ స్టోరీ” సినిమా మూడు రోజుల్లోనే 34 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని (Gross collections) కలెక్ట్ చేసిందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
ఆదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా టీజర్ విడుదల చేయటంతోనే సినిమా చుట్టూరుగా వివాదాలు అలాగే కోర్టు ఆర్డర్లు అంటూ చాలా వరకు సినిమాని ఆపేయటానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు సినిమా విడుదలయ్యి కలెక్షన్స్ పరంగా అలాగే ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు దేశమంతటా ఈ కేరళ స్టోరీ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి ఎలాంటి పాపులారిటీ వచ్చిందో దానికి మించి ఈ కేరళ స్టోరీ కి పాపులారిటీ పెరిగింది. తమిళనాడులో పెద్ద సిటీస్ లో ఈ చిత్ర ప్రదర్శనని రద్దు చేశారు. అయిన కాని సినిమా కి వచ్చే కలెక్షన్స్ ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Web Title: the kerala story box office collection, the kerala story collection day 3, the kerala story total collection, the kerala story worldwide collection, Adah Sharma