The Kerala Story Release Date: కాశ్మీర్లో అప్పట్లో కాశ్మీర్ పండితులకు ఎదురైన సమస్యలు మరియు ఊచ కోతలకు సంబంధించి వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదట్లో వివాదాలతో మొదలైన ఈ చిత్రం క్రమంగా ప్రేక్షకుల అభిమానాన్ని చోరకొంది. బాలీవుడ్ ఇక జాలైనా హీరోలు నటించిన చిత్రాలను సైతం వెనక్కు నెట్టి ఈ చిత్రం తన సత్తాను చాటుకుంది. కరోనా క్రైసిస్ లో కూడా ఈ సినిమా నిలబెట్టి ఆడింది అంటే కంటెంట్ ప్రేక్షకుల హృదయాలకు ఎంత దగ్గరగా వెళ్లిందో అర్థమవుతుంది.
The Kerala Story Release Date: ఇదే క్రమంలో ఇప్పుడు ‘ది కేరళ స్టోరి`మరో తాజా చిత్రం రాబోతుంది. ఈ చిత్రం కూడా కాశ్మీర్ ఫైల్స్ తరహాలలో కొత్త వివాదాలకు ఆధారం పోసి ఐసిస్ టెర్రర్ నేపథ్యంలో సాగుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అత్యంత వివాదాస్పద కంటెంట్ తో కూడుకున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ బుధవారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ముఖ్యంగా నలుగురు మహిళల జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇందులో అదా శర్మ (Adah Sharma) కీలక పాత్ర పోషిస్తున్నారు.
సాధారణంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు అనుకోకుండా టెర్రర్ ఊబిలో ఎలా చిక్కుకున్నారు అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనే ప్రపంచ కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లో చేరిన కాలేజీ అమ్మాయిల జీవితం ఎన్ని మలుపులు తిరుగుతున్నది అన్నది తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇది నిజ జీవితంలో జరిగిన కొన్ని కథల ఆధారంగా రూపొందించిన చిత్రం అని తెలుస్తోంది.
కేరళలో కొందరి కాలేజీ అమ్మాయిలకు బ్రెయిన్ వాష్ చేసి మతమార్పిడికి ప్రేరేపించడంతోపాటు భారతదేశ మరియు ప్రపంచంలోని ఇస్లామిక్ టెర్రర్ మిషన్లకు వాళ్లని వాడుకుంటారు. ఇలా ఆ సంస్థలోకి ప్రవేశించిన సుమారు 32000 మంది మహిళల జీవితంలో జరిగిన సంఘటనలను వెలికి తీసి రూపొందించిన చిత్రం ఇది. వీళ్ళల్లో ఒకరైన ఫాతిమాబా అనే పాత్రలో అదా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ పై నేటిజెన్ ల నుంచి సానుకూల మరియు ప్రతికూల స్పందనలు ఒకే విధంగా అందుతున్నాయి. ఈ చిత్రం మే 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.