Narappa Trailer: వెంకటేశ్‌ పెర్ఫామెన్స్ అదుర్స్..!

0
1241
the makers of Venkatesh, Priyamani Narappa unveiled the trailer of the film

Narappa Trailer: అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇవాళ ట్రైలర్ ను విడుదల చేశారు.

భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేశ్‌ నటన చప్పట్లు కొట్టించేలా ఉంది. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకీ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

ధనుష్‌ నటించిన ‘అసురన్‌’ ప్రేక్షకులు, ప్రముఖుల నుంచే కాకుండా విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. కాగా, తెలుగు నేటివిటీకి తగిన విధంగా ‘అసురన్‌’లో కొన్ని మార్పులు చేసి ‘నారప్ప’ తెరకెక్కించారు. ఇందులో వెంకటేశ్‌ సరసన ప్రియమణి కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు. జులై 20న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Watch Here For Venkatesh Narappa Trailer