Ram Pothineni, Anupama parameswaran, Tollywood Movie News
Ram Pothineni, Anupama parameswaran, Tollywood Movie News

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ అయిపోయాయి.రామ్ క్రేజ్ బాగా పెరిగింది అని అర్ధమయ్యే విధంగా అభిమానులు బాగానే సెలబ్రేట్ చేసారు.ఇక ఇస్మార్ట్ శంకర్ టీజర్ కూడా బాగా పేలింది అంతా ఫుల్ హ్యాపీ.

అయితే ఈ మధ్య ప్రతి హీరో పుట్టినరోజుకి కామన్ DP ఒకటి రిలీజ్ చెయ్యడం ఒక కల్చర్ గా మారింది.ఏ హీరో పుట్టిన రోజు అయితే ఆ హీరో అభిమానులు గాని,లేక సోషల్ మీడియా టీమ్ గానీ ఈ DP రూపొందిస్తారు.మరి రామ్ కి అది ఎవరు డిజైన్ చేసి ఇచ్చారో తెలుసా…?….అతనితో రెండు సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్.వేరే హీరోయిన్ ఎవరయినా అయితే అది పెద్ద మ్యాటర్ కాదు.కానీ ఉన్నది ఒకటే జిందగీ టైం లోనే రామ్ కి,అనుపమ కి మధ్య సంథింగ్ సంథింగ్ అని ర్యూమర్స్ వచ్చాయి.

ఇక హలో గురు ప్రేమకోసమే టైం లో అయితే రామ్ కోసమే అనుపమ సినిమా చేసింది అని టాక్ నడించింది.అలాంటిది ఇప్పుడు ఏకంగా రామ్ బర్త్ డే ముందు రోజే ఆమె DP పంపడం,అది చుసిన రామ్ నవ్వుకుంటూ హగ్స్ అని కామెంట్ పెట్టడం చూసి ఆగిపోయిన ఊహాగానాలు మళ్ళీ మొదలవుతున్నాయి.గుడ్ ఫ్రెండ్స్ అని సమర్ధించేవాళ్ళు కూడా ఉన్నారు.కానీ ఆ మాట ఆ ఇద్దరూ మాటవరసకు కూడా చెప్పకపోవడమే విడ్డూరంగా ఉంది.