SS Rajamouli, RRR Movie, Jr NTR ,Ram Charan, Tollywood Movie News
SS Rajamouli, RRR Movie, Jr NTR ,Ram Charan, Tollywood Movie News

రాజమౌళి తాను డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించారు. దీంతో ఔత్సాహికులు చాలామంది తమకు తోచిన పేర్లను సజెస్ట్ చేశారు. అన్నిటినీ పరిశీలించిన రాజమౌళి అండ్ టీమ్ చివరికి ఒక పేరును బలంగా పరిశీలిస్తున్నారని టాక్. అదే ‘రామ రాజ రౌద్రం’. ఈ పేరే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయట.

ఇక ఇతర భాషల కోసం ‘రైజ్ రివొల్ట్ రివెంజ్’ అనే టైటిల్ పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్ర చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదలచేయనున్నారు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.