Allu Aravind, Nitesh Tiwari, Ravi Udyawar , Ramayana Telugu Movie
Allu Aravind, Nitesh Tiwari, Ravi Udyawar , Ramayana Telugu Movie

సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటె భాష,నటీనటులు,నేటివిటీ లాంటి బౌండరీస్ ని బ్లాస్ట్ చేసి మరీ భారీ విజయం అందుకోవచ్చు అని ప్రపంచానికి మరొక్కసారి చాటిచెప్పిన సినిమా బాహుబలి.భారీతనం అనేది ఆ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించినా,అంత పెద్ద విజయం దక్కడానికి అనేక కారణాలు ఉన్నాయి.అయితే ఆ విజయం అనేకమంది ప్రొడ్యూసర్స్ కి భారీ సినిమాలు తియ్యడానికి భరోసా ఇచ్చింది అనేది నిజం.

[INSERT_ELEMENTOR id=”3574″]

రీసెంట్ గా అల్లు అరవింద్ రామాయణం సినిమాని పాన్ ఇండియా మూవీ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నిర్మించడం అనే అనౌన్స్ మెంట్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది.ఆ సినిమాలో ఏ పాత్రకు ఎవరు బావుంటారు అని సోషల్ మీడియా లో అభిప్రాయాలు వెల్లువెత్తాయి.కానీ కమర్షియల్ గా అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లడం అనేది సాధ్యమేనా?.ఎందుకంటే 1500 కోట్ల వ్యయం తో,తెలిసిన కథనే మూడు భాగాలుగా చెప్పడం అంటే చాలా రిస్క్.ఫస్ట్ పార్ట్ 2021 లో రిలీజ్ అంటున్నారు,అంటే మూడు పార్ట్ లు రిలీజ్ అయ్యే సరికి ఎంతలేదన్నా ఆరేళ్ళు పడుతుంది.ఇప్పుడున్న జెనరేషన్ స్టార్ హీరోస్ లో ఒక్క సినిమాకి అంత టైం కేటాయించేది ఎవరు?.మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమాలో ఉండాలి అనేది ఆడియన్స్ కండిషన్ గా మారుతుంది.

రామ్ చరణ్ కి చాలా కమిట్మెంట్స్,బన్నీ అలాంటి వాటికి దూరం,చిరు సైరా కోసమే చాలా రిస్క్ చేశారు.మళ్ళీ ఆ రేంజ్ రిస్క్ చెయ్యడం కష్టమే.ప్రభాస్,ఎన్టీఆర్,మహేష్ అంతా కూడా ఆరేళ్ళు డేట్స్ ఇవ్వడం అనేది ఇంపాజిబుల్.బాలీవుడ్ లో కూడా బడా స్టార్స్ 3D ప్రాజెక్ట్ అంటేనే ముఖం చాటేస్తున్నారు.స్టార్స్ లేకపోతే మార్కెటింగ్ విషయంలోనే స్టార్స్ కనిపిస్తాయి.పైగా వీటిలో మొదటి భాగం గానీ,రెండో భాగం గానీ కాస్త అటూ,ఇటూ అయితే నిర్మాతలు ఎలా ధైర్యం చేస్తారు.పైగా నితీష్ తివారి,రవి ఉద్యావర్ లు హిట్ సినిమాలు తీసినా CG ని,VFX ని పెద్ద స్కేల్ లో హ్యాండిల్ చేసిన అనుభవం లేదు.వాళ్ళు కూడా ఒకే ప్రాజెక్ట్ పై అన్ని సంవత్సరాలు కాన్సన్ట్రేట్ చేసి ఉండగలరా?.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఈ ప్రశ్నల వెనుక ఇలా మొదలయ్యి ఆగి పోయిన సినియాల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.మోహన్ లాల్ కీలకపాత్రలో దాదాపు 2000 కోట్లతో,రండమోజం పుస్తకం ఆధారంగా భారత కథను తెరెక్కించే ప్రయత్నం జరిగింది.కానీ ముందే మార్కెటింగ్ సమస్యలు అర్ధం అయ్యి ఆగిపోయారు.విక్రమ్ హీరో గా భారీ బడ్జెట్ తో కర్ణ అనే సినిమా స్టార్ట్ చెయ్యాలి అనే ప్రొపోజల్ ఎప్పుడో వచ్చింది.కానీ అది అక్కడే ఆగింది తప్ప,ఇంచ్ కూడా ముందుకు కదల్లేదు.అలాగే రీసెంట్ గా కన్నడలో కూడా ఆ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో కురుక్షేత్ర అనే సినిమా చేశారు.మార్కెటింగ్ అనే విషయాన్ని పక్కనబెట్టి ఆ సినిమా చేశారు.కానీ సరయిన విజువలైజేషన్ లేక సూపర్ హైప్ రావాల్సిన ఆ సినిమా ట్రైలర్ నెగెటివ్ మార్కులు వేయించుకుంది.

మరి ఈ ట్రెండ్ లో మార్కెట్ స్పెషలిస్ట్ అయిన అల్లు అరవింద్ ఈ స్టెప్ తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.ఈ సినిమా నెక్స్ట్ స్టెప్ కి వెళితే తప్ప ఈ మెగా రామాయణం గురించి ఎవ్వరూ,ఏమీ చెప్పలేరు.

[INSERT_ELEMENTOR id=”3574″]