This week Theaters and OTT Movie release list: సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం కంటే కూడా చాలామంది ఇంటి వద్దనే ప్రశాంతంగా కూర్చొని ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో మూవీస్ చూడడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ దిగ్గజ సంస్థలు కూడా తమ ఓటిటి కంటెంట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ లు తీసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
This week Theaters and OTT Movie release list: సినిమాలన్నా నెలకి రిలీజ్ అవుతాయేమో కానీ ఆన్లైన్లో ప్రతివారం కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా సందడి చేస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్ రిలీజ్ లు కూడా భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అందరిని అలరించడానికి ఈ వారం అటు థియేటర్లలో మరియు ఇటు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు గురించి తెలుసుకుందాం.
This week Theaters release movie list
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ చిత్రం ఒక పది రోజులకే పలు రకాల వివాదాల కారణంగా పలచన పడిపోయింది. లేకపోతే ఇప్పుడు వస్తున్న చిన్న చిత్రాలకు అది భారీ పోటీగా ఉండేది మరి. కార్తికేయ 2 చిత్రం తర్వాత బాగా పాపులర్ అయిన నిఖిల్ నటిస్తున్న స్పై చిత్రం తెలుగు మరియు ఇతర భాషల డబ్డ్ వెర్షన్ జూన్ 29న విడుదల కానుంది.
దీనితో శ్రీ విష్ణు నటించిన సామజ వర గమన చిత్రం కూడా జూన్ 29న విడుదల కానుంది. అలాగే మాయాపేటిక ,లవ్ యు రరామ్, నారాయణ & కో. చిత్రాలు జూన్ 30న విడుదలవుతున్నాయి. వీటితో పాటుగా సత్య ప్రేమకి కథ అనే హిందీ చిత్రం మరియు ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ మరియు డబ్డ్ వెర్షన్) జూన్ 29న విడుదల కానున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం తొలిప్రేమ జూన్ 30న గ్రాండ్గా రీ రిలీజ్ కాబోతోంది.

This week OTT movie release date:
ఈవారం ఓటీటీ లో కూడా పలు చిత్రాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి అవి ఏమిటో తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్: కోలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో ఓరియంటెడ్ మూవీ గా వీరన్ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం జూన్ 30 నుంచి ఆన్లైన్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.
నెట్‌ఫ్లిక్స్: హాట్ హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సీక్వెల్ గా విడుదలవుతున్న లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. అలాగే అఫా అనే హిందీ చిత్రం కూడా జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఆహా: తెలుగు వెబ్ సిరీస్, అర్థమైందా అరుణ్ కుమార్ జూన్ 30 నుంచి ఆహా ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: హిందీ వెబ్ సిరీస్ ఆయిన ది నైట్ మేనేజర్ 2 జూన్ 30 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.