This week OTT and Theaters movies release dates: సమ్మర్ హాలిడేస్ మొదలయ్యే టైం కి.. ఈసారి థియేటర్లలో పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి అని చెప్పవచ్చు. గత వారం రిలీజ్ అయిన రామబాణం మరియు ఉగ్రం సినిమాలు ఓ రకంగా అందరినీ నిరాశపరిచాయి. దీంతో ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోపక్క థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో (OTT) రిలీజ్ అయ్యే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది. మరైతే ఈ వారం సందడి చేయడానికి వస్తున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం.
థియేటర్లో రిలీజ్ కాబోతున్న మూవీస్:
ఈసారి పెద్ద హీరోల సినిమాలు అయితే లేవు కానీ యావరేజ్ హీరోల సినిమాలు…కాస్త వినూత్నమైన కాన్సెప్ట్స్ తో వస్తున్నాయని చెప్పవచ్చు.
కస్టడీ: నాగచైతన్య మరియు కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మరియు థ్రిల్లర్ మూవీ కస్టడీ. పోలీసులు ,క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు యాక్షన్ సిరీస్ తో సాగే ఈ చిత్రం ఫ్లాపులతో బాధపడుతున్న నాగచైతన్య కెరీర్ కు ఎంతో ముఖ్యం. మే 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోపక్క పెద్ద పోటీ లేదు కాబట్టి ఈ చిత్రం బాగానే ఆడొచ్చు అన్న వాదన వినిపిస్తోంది.
ఛత్రపతి(హిందీ) : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో డెబ్యూ ఇస్తున్న మూవీ చత్రపతి హిందీ రీమేక్. ఈ చిత్రం కూడా మే 12న విడుదల కాబోతోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది అని అందరూ ఆశిస్తున్నారు. ఏ మూవీ సక్సెస్ అయితే బెల్లంకొండ కనీసం బాలీవుడ్ లో అయినా సెటిల్ అవుతాడేమో…. చూడాలి.
భువన విజయమ్ : ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ కి యలమంద చరణ్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో సునీల్, వెన్నెల కిషోర్,, శ్రీనివాస్ రెడ్డి ,వాసంతి ,పృధ్వి, ధనరాజ్ ముఖ్యపాత్రను పోషించారు. ఈ కామెడీ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. కామెడీ ప్రేక్షకులను మెప్పించగలిగితే మాత్రం చిత్రం హిట్ అయ్యే అవకాశం ఉంది…
ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ : మే 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం లో నిహాల్ కోదాటి మరియు దృషికా చందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓ అందమైన అమ్మాయి అకస్మాత్తుగా అదృశ్యమైతే.. దాని వెనుక అసలు కథ ఏమిటి? పోలీసులు ఆమెను ఎలా కనుగొన్నారు.. అనే అంశాల చుట్టూ అందంగా నిర్మించిన మూవీ ఈ ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్.
కళ్యాణమస్తు : శేఖర్ వర్మ, వైభవి రావ్ కాంబినేషన్లో ఒ.సాయి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం కళ్యాణమస్తు. లవ్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లో వస్తున్నాయి చిత్రం మే 12న విడుదల కాబోతోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న మూవీస్ /వెబ్ సిరీస్
ఆహా: న్యూసెన్స్ (తెలుగు వెబ్ సిరీస్) బిందు మాధవి మరియు నవదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూసెన్స్ తెలుగు వెబ్ సిరీస్ ఈనెల 12న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నేటి మీడియా డబ్బు వల్ల ఎలా ప్రభావితం అవుతుందో అన్న విషయంపై ఈ సీరియస్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఎయిర్ (హాలీవుడ్ మూవీ): ఓ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అయిన ఎయిర్. ఏప్రిల్ 5న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ హాలీవుడ్ చిత్రం మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
దహాద్ (హిందీ సిరీస్): బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా లీడ్ రోల్ లో నటిస్తున్న దహాద్ హిందీ వెబ్ సిరీస్ మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రైమ్ ట్రిల్లర్ వెబ్ సిరీస్ లో సోనాక్షి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనుంది.
నెట్ ఫ్లిక్స్:
క్వీన్ క్లియోపాత్ర (హాలీవుడ్ సిరీస్): ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర గురించి పెరకెక్కించిన క్వీన్ క్లియోపాత్ర హాలీవుడ్ సిరీస్ మే 10 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ద మదర్ (హాలీవుడ్ మూవీ): మంచి యాక్షన్ థ్రిల్లర్గా సాగే దామోదర్ హాలీవుడ్ మూవీ మే 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను వదిలిపెట్టిన కూతురును దుండగుల బారి నుంచి కాపాడడానికి అజ్ఞాతం నుంచి బయటికి వచ్చిన హంతకురాలు అయినా తల్లి కథ ఈ చిత్రం.
తిరువిన్ కురల్: మంచి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అయిన తమిళ్ మూవీ. తిరువిన్ కురల్ మే 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ద మప్పెట్స్ మేహం: ఈ హాలీవుడ్ సిరీస్ మే 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
సొప్న సుందరి: ఈ తెలుగు డబ్బింగ్ చిత్రం మే 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Web Title: This week OTT and Theaters movies release dates, This week top OTT movies release dates, This week box office movie release dates, This week OTT & Movies list