This week OTT and Theaters movie release dates: ప్రతినెలా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు కంటే కూడా ఓటీటీ లో (OTT) సందడి చేసే సినిమాలు మరియు వెబ్ సిరీస్ (web series) సంఖ్య రోజుకి ఎక్కువ అయిపోతుంది. జనాలు బిగ్ స్క్రీన్ పై సినిమా చూడడం కంటే కూడా ఇంట్లో కూర్చుని హాయిగా ఆన్లైన్ సినిమాల చూడడానికి ఎక్కువ ఓటు వేస్తున్నారు. వినూతమైన కాన్సెప్ట్స్ తో వచ్చే వెబ్ సిరీస్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పెద్దపెద్ద హీరో హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
This week OTT and Theaters movie release dates: ప్రస్తుతం వెబ్ సిరీస్ హవా నడవడంతో.. వెంకటేష్ (Venkatesh) లాంటి స్టార్ హీరో దగ్గర నుంచి సమంతా (Samantha) లాంటి గ్లామర్ హీరోయిన్ వరకు వెబ్ సిరీస్ల వెనక పరుగు పడుతున్నారు. సెలవుల సమయం కావడంతో ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లపై ఆసక్తి నెలకొని మరి ఎందుకు ఆలస్యం ఈవారం బిగ్ స్క్రీన్ పై మరియు ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్ గురించి చూద్దాం.
బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు మరియు రానా తమ్ముడు అయిన అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సరికొత్త మూవీ అహింస (Ahimsa) ఈ వారం ప్రేక్షకుల ముందుకు జూన్ 2న రాబోతోంది. ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు డైరెక్టర్ తేజ (Director Teja) నిర్వహించగా మ్యూజిక్ డైరెక్టర్గా ఆర్పి పట్నాయక్ చాలా సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మరోపక్క ఇంకో ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ బాబు కూడా హీరోగా నటిస్తున్న రెండవ సినిమా నేను స్టూడెంట్ స్టార్ (Nenu Student Sir) జూన్ 2 నె విడుదల కాబోతోంది. సరికొత్త కాన్సెప్ట్ తో స్టూడెంట్ పోలీస్ మధ్య జరిగే ఆధిపత్యం ఈ మూవీలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నెగిటివ్ స్టేట్స్ ఉన్న పోలీస్ పాత్రలో సముద్రఖని కనిపించనున్నారు. రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
వీటితో పాటుగా జూన్ 2న ఐక్యూ అని చిత్రం మరియు సురేష్ ప్రొడక్షన్స్ తో రానా నిర్మించిన పరేషాన్ అనే మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. పరేషాన్ మూవీలో మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా చేస్తున్నాడు. అలాగే అజయ్ హీరోగా నటిస్తున్న చక్రవ్యూహం మూవీ కూడా జూన్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. బడాస్టార్ లో సినిమాలు ఏమీ లేకపోవడంతో.. ఈ చిత్రాల్లో కంటెంట్ దేనికి బాగుంటే అవి కచ్చితంగా హిట్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది.

మరి ఇక ఆన్లైన్లో సందడి చేయబోతున్న మూవీస్ మరియు వెబ్ సిరీస్ గురించి చూద్దాం..
అమెజాన్ ప్రైమ్: అమెజాన్ ప్రైమ్ లో జూన్ 2న బ్యాక్ డోర్ అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
జీ5: జి ఫైవ్ లో విశ్వక్ తెలుగు మూవీ జూన్ 2 నుంచి టెలికాస్ట్ కాబోతోంది.
జియో సినిమా: అసుర్ సీజన్ 2 అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 1 నుంచి మరియు ముంబై కార్ అనే బాలీవుడ్ మూవీ జూన్ 2 నుంచి జియో సినిమాలో ప్రసారమవుతాయి.
డిస్నీ ప్లస్ హాట్స్టార్: స్కూల్ ఆఫ్ లైఫ్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
నెట్ఫ్లిక్స్: ఫేక్ ప్రొఫైల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ మే 31 నుంచి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంటుంది. బ్యూటిఫుల్ లైఫ్ ,ఇన్ఫినిటీ స్టోర్మ్ అని హాలీవుడ్ మూవీలు మరియు న్యూ ఆమ్స్టర్ డ్యామ్ అని హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 1 నుంచి నెట్ ఫ్రిడ్జ్ లో ప్రసారమవుతుంది.మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 హాలీవుడ్ వెబ్ సీరియస్ , స్కూప్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 2న స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.
Web Title: New OTT Releases This Week, this week OTT and theatres movie release dates, Find New OTT Releases this Week, New Theatres movie release dates, May 2023 last week Movie release dates, Ahimsa movie, Nenu Student Sir movie, This week telugu movie release dates,