This week OTT and Theatres movie release dates: ఈవారం పలు చిత్రాలు వేసవి సెలవుల సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో హడావిడి చేయడానికి వస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాలు పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.
This week OTT and Theatres movie release dates: ఏజెంట్: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా ఎప్పటినుంచో విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఏజెంట్ ఎట్టకేలకు ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అఖిల్ సినీ కెరియర్ కు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ మూవీ పెట్టు కాకపోతే ఇండస్ట్రీలో అఖిల్ నిలకడ కాస్త కష్టం అని చెప్పవచ్చు.
పొన్నియిన్ సెల్వన్ 2: గత ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్న పౌరాణిక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా మొదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో అనువదించబడినప్పటికీ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి వస్తున్న ఈ చిత్రం సీక్వెల్ లో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఎన్నో మార్పులను చేసినట్లు తెలుస్తోంది. ఏజెంట్ చిత్రానికి పోటీగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం పై హైప్ మామూలుగా లేదని చెప్పవచ్చు.
జనాలు థియేటర్లకు వెళ్లి చిత్రాలను ఎంతగా చూస్తున్నారో అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఇంటి వద్ద నుంచి ఓటీటీలో కొత్త చిత్రాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మూవీస్ మరియు వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం…
నెట్‌ఫ్లిక్
Dasara Movie: నాని నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రీసెంట్గా విడుదలైన దసరా మూవీ మంచి మాస్ ఓరియెంటెడ్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఏప్రిల్ 27న దసరా మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెక్లెస్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.
అలాగే కోర్ట్ లేడీ మరియు నోవోల్యాండ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 వ తేదీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటుగా ఎకా మరియు బిఫోర్ లైఫ్ ఆఫ్టర్‌డెత్ అని హాలీవుడ్ చిత్రాలు ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ సిద్ధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్: పత్తు తల అనే తమిళ మూవీ ఏప్రిల్ 27 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
జీ5: యూటర్న్ హిందీ చిత్రం ఏప్రిల్ 28 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
డిస్నీ హాట్‌స్టార్ : సేవ్ ది టైగర్స్ అనే తెలుగు సిరీస్ ఏప్రిల్ 27 వ తేదీ నుంచి మరియు పీటర్ పాన్ అండ్ వెండీ అనే హాలీవుడ్ చిత్రం ఏప్రిల్ 28వ తేదీ నుంచి డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతాయి.