This week OTT and theatres movies list: సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ఓవైపు సరికొత్త సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే, మరోవైపు డిజిటల్ వేదికలు సైతం ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నాయి.
This week OTT and theatres movie release dates:అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకునేవారు హాలుకు వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమాలు చూస్తుంటే.. మరికొందరు మాత్రం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి డిజిటల్ కంటెంట్ చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో నాలుగు కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుంటే.. ఏకంగా 20 చిత్రాలు/సిరీసులు ఓటీటీలలోకి రాబోతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
‘రామబాణం’:
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రామబాణం’. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ప్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్.. మే 5న విడుదల కాబోతోంది. గతంలో గోపీచంద్ – శ్రీవాస్ కాంబోలో వచ్చిన వచ్చిన ‘లక్ష్యం’ ‘లౌక్యం’ చిత్రాలు మంచి విజయం సాధించడంతో.. ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలో మంచి అంచనాలున్నాయి.
‘ఉగ్రం’:
అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన సినిమా ‘ఉగ్రం’. షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో మిర్నా హీరోయిన్ గా నటించింది. ఇందులో నరేష్ తొలిసారిగా సీరియస్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ‘నాంది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నరేష్ – విజయ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
‘అరంగేట్రం’ & ‘యాద్గిరి అండ్ సన్స్’:
ఈ వారం రెండు చిన్న సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి. నూతన నటీనటులతో తెరకెక్కిన ‘అరంగేట్రం’ అనే సినిమాతో పాటుగా.. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాద్గిరి అండ్ సన్స్’ అనే చిత్రం మే 5న విడుదల కాబోతున్నాయి.
This week ott release: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీసులు:
నెట్ ఫ్లిక్స్:
మీటర్ (తెలుగు) – మే 05
అమృతం చందమామలో (తెలుగు) – మే 05
తూ ఝూతి మైన్ మక్కర్ (హిందీ) – మే 05
క్వీన్ షార్లెట్: ఏ బ్రిడ్జెర్టన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – మే 04
క్లిఫర్డ్: ది బిగ్ రెడ్ డాగ్ (ఇంగ్లీష్) – మే2
ది టేర్ (ఇంగ్లీష్) – మే 2
శాంక్చురీ (మూవీ)– మే 4
ది లార్వా ఫ్యామిలీ (యామినేషన్) – మే 4
డిస్నీ+హాట్ స్టార్:
సాసు బాహు ఔర్ ఫ్లెమింగో (హిందీ) – మే 05
కరోనా పేపర్స్ (మలయాళం) – మే 05
ఎడ్ షీరన్: ద సమ్ ఆఫ్ ఇట్ ఆల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
రెన్నరవేషన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
స్టార్ వార్స్: విజన్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – మే 04
జీ5:
ఫైర్ ఫ్లైస్: పార్థ్ ఔర్ జుగ్ను (హిందీ సిరీస్) – మే 05
శెభాష్ ఫెలుడా: గ్యాంగ్ టోక్ గోండోగల్ (బెంగాలీ మూవీ) – మే 05
శెభాష్ ఫెలుడా (బెంగాలీ మూవీ) – మే 05
ఈటీవీ విన్: మ్యాచ్ ఫిక్సింగ్ (తెలుగు సినిమా) – మే 05
ఆహా: గీతా సుబ్రహ్మణ్యం-3 (తెలుగు సిరీస్) – మే 05