డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, సినీ ప్రియులు ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని పొందడానికి అలవాటు పడిపోయారు. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని తెలుగులోనూ ఓటీటీల హవా మొదలైంది. ప్రేక్షకులు ప్రతీ వారం సరికొత్త కంటెంట్ ను వీక్షించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనాలను ఆకట్టుకోడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందించడానికి డిజిటల్ వేదికలు ప్రయత్నించాయి. సరికొత్త సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ వారం అన్ని ఓటిటిలలో కలిపి దాదాపు 20కి పైగా సినిమాలు, ఒరిజినల్ సిరీసులు, స్పెషల్ షోలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుపాటి తొలిసారిగా కలసి నటించిన “రానా నాయుడు” వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి వచ్చేసింది. బిందు మాధవి, సుహస్, మడోన్నా సెబాస్టియన్, వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్ తదితరులు నటించిన ”యాంగర్ టేల్స్” అనే సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్రిస్టోఫర్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది.
అమెజాన్ ప్రైమ్:
క్రిస్టోఫర్ – తెలుగు/మలయాళం
వారయన్ – మలయాళం
దాదా – తమిళం
వారిసు – హిందీ
హ్యాపీ ఫ్యామిలీ – హిందీ
హాట్ స్టార్:
యాంగర్ టేల్స్ (వెబ్ సిరీస్) – తెలుగు
రన్ బేబీ రన్ – తెలుగు, తమిళ
చాంగ్ కెన్ డంక్ – ఇంగ్లీష్
నెట్ ఫ్లిక్స్:
రానా నాయుడు (వెబ్ సిరీస్) – తెలుగు/హిందీ
రేఖ – మలయాళం
లూథర్ ది ఫాలెన్ సన్ – ఇంగ్లీష్
ది గ్లోరీ (సీజన్ 1) – కొరియన్
అవుట్ లాస్ట్ (సీజన్ 1) – ఇంగ్లీష్
యూ (సీజన్ 4) – హిందీ/ఇంగ్లీష్
MH370: ది ప్లేన్ దట్ డిసప్పియర్డ్ – డాక్యుమెంటరీ సిరీస్
జీ5:
రేమో – కన్నడ
బొమ్మై నాయగి – తమిళం
మిడిల్ క్లాస్ లవ్ – హిందీ
బౌడి క్యాంటీన్ – బెంగాలీ
సోనీ లివ్::
నిజం విత్ స్మిత (టాక్ షో)– సాయిపల్లవి ఎపిసోడ్
బ్యాడ్ ట్రిప్ (సిరీస్) – తెలుగు
క్రిస్టీ – మలయాళం
యాక్సిడెంటల్ ఫార్మర్ & కో ( సిరీస్) – తమిళం
సైనా ప్లే:
చతురం – మలయాళం
సింప్లీ సౌత్:
కన్నితీవు – తమిళం