Telugu Movies Release Dates This Week: ప్రతివారం లాగా ఈ వారం కూడా తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఏకంగా నాలుగు చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సందీప్ కిషన్, సుహాస్ అలాగే అనిఖా సురేంద్రన్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి.
Telugu Movies Release Dates This Week: ఇక ఈ సినిమాల వివరాలు చూస్తే, సందీప్ కిషన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా మైఖేల్. ఇప్పటికే విడుదలైన రైతులు అలాగే టీజరు ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. సందీప్ కిషన్ కి మైఖేల్ మొదటి ఫ్యాన్ ఇండియా సినిమా. ఈ సినిమాని లోకేష్ కనకరాజు హిందీలో ప్రమోట్ చేస్తున్నారు. మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రెండో ఉమా విషయానికి వస్తే, ప్రతి సినిమాలోని సపోర్టింగ్ క్యారెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. రైటర్ పద్మభూషన్ నీ టైటిల్ తో ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం చేశారు. డిఫరెంట్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. రైటర్ పద్మభూషన్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది.
ఇక తర్వాత సినిమా అయినా, త్రిగుణ్, మేఘ ఆకాష్ జంటగా వస్తున్న సినిమా ప్రేమదేశం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాని ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ సిద్ధం డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
ఇక మనం అనుకున్న నాలుగోవ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన బుట్టబొమ్మ. అర్జున్‌దాస్, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 4నా విడుదలకు సిద్ధం చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి.
మలయాళంలో విజయవంతమైన కప్పేలా ఆధారంగా బుట్టబొమ్మ సినిమాను తెరకెక్కించారు. ఈ వారంలో విడుదలవుతున్న ఈ చిన్న బడ్జెట్ సినిమాలు ఏవి సక్సెస్ అవుతాయో మరి కొన్ని రోజులు పోతే తెలుస్తుంది.