ముగ్గురు పవన్ అభిమానులు మృతి

0
2646
Three Pawan Kalyan Fans Died Of Electric Shock In Kuppam

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (Birthday) వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. రేపు (సెప్టెంబర్ 2న) పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురష్కరించుకుని ఏడవ మైల్ వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ఐదు మంది విద్యుత్ షాక్ తగిలింది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కుప్పంలోని పీఈయస్ హాస్పిటల్‌కు తరలించారు.

చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఉండడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై స్థానిక శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, ఆర్ధిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

పవన్ కళ్యాణ్ రేపు 49వ ఏట అడుగుపెడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలను జరుపుకోరు. ఇలాంటి ఆడంబరాలకు ఆయన దూరంగానే ఉంటారు. అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున పవన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరం.

Previous articlePawan Kalyan Birthday:స్పెషల్.. అభిమానులకు డబుల్ ధమాక..!
Next articlePawan Kalyan fans die due to electric shock