Homeసినిమా వార్తలుబాలకృష్ణ నెక్స్ట్ సినిమా కోసం ఆ ముగ్గురు డైరెక్టర్లు రెడీ.!

బాలకృష్ణ నెక్స్ట్ సినిమా కోసం ఆ ముగ్గురు డైరెక్టర్లు రెడీ.!

Nandamuri Balakrishna next NBK110 movie director, Balakrishna next NBK110 director, Balakrishna upcoming movies, Nandamuri Balakrishna, Boyapati’s Sreenu, Gopichand Malineni, and Anil Ravipudi

Nandamuri Balakrishna next NBK110 movie director, Balakrishna next NBK110 director, Balakrishna upcoming movies, Nandamuri Balakrishna, Boyapati’s Sreenu, Gopichand Malineni, and Anil Ravipudi

అఖండ, వీరసింహా రెడ్డి, అలాగే భగవంత్ కేసరి వరుస సినిమాలతో భారీ విజయాలు సాధించిన బాలకృష్ణ నెక్స్ట్ సినిమా NBK109 దర్శకుడు బాబీతో అనౌన్స్ చేయడం జరిగింది.. మూడు సినిమాలు వరుస భారీ విజయాలు సాధించిన తర్వాత నాలుగో సినిమా కూడా భారీ విజయాన్ని సాధించాలని బాలకృష్ణ అలాగే తన దర్శకుడు బాబి పక్కా ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది.

అయితే దీని తర్వాత రాబోయే NBK110 సినిమా దర్శకుడు ఎవరు అంటూ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ముగ్గురు దర్శకులు బాలయ్యను గొప్పగా ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఈ ముగ్గురు దర్శకులు బాలకృష్ణతో కలిసి మళ్లీ సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్టు సమాచారం అయితే అవుతుంది.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు గోపీచంద్ మలినేని సినిమా అయితే కన్ఫామ్ అయిందంటున్నారు. అయితే ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా రవితేజ తో చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన తర్వాత బాలకృష్ణతో సినిమా ఉంటుందని ఫిలిం నగర్ లో టాక్ అయితే గట్టిగానే వినపడుతుంది.

Balakrishna next movie director details

ఇక బోయపాటి శీను ప్రస్తుతం స్కంద మూవీ విడుదల చేసిన తర్వాత మళ్లీ తన సత్తా చాటుకోవడానికి సీనియర్ హీరోని చూస్తున్నారు. ముందుగా అయితే బాలకృష్ణ తోనే సినిమా చేయాలని గట్టిగా పట్టు పట్టి కూర్చున్నారంట. ఇక భగవంత్ కేసరి సినిమాతో విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తను బాలకృష్ణతో ఇంకో సినిమా చేయటానికి రెడీగా ఉన్నట్టు చెప్పకనే చెప్పారు.

అయితే ప్రస్తుతం దిల్ రాజు అలాగే అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు గుసగుసలు అయితే వినపడుతున్నాయి.. కానీ మరోపక్క అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయాలని స్టోరీ కూడా రెడీ చేస్తున్నారంట.. అయితే చిరంజీవి ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అవటంతో తన తదుపరి సినిమా కూడా బాలకృష్ణతో చేయాలని ఇప్పటికే చర్చలు కూడా చేసినట్టు సమాచారమైతే అందుతుంది. ఇక బాలకృష్ణ తన తదుపరి సినిమా NBK110 ఏ డైరెక్టర్ తో చేస్తారో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.