Latest Posts

Thug Life vs Raja Saab: ప్రభాస్ కమలహాసన్ పోటీ తప్పదా..?

- Advertisement -

Thug Life vs Raja Saab Release dates: ఏప్రిల్ 10 2025న కమల్ హాసన్ అలాగే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు. ఒకవైపు మణిరత్నం అయితే మరోవైపు మారుతి ఇద్దరు దర్శకులు తమ సినిమాలతో ముందుకు రాబోతున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాజ సాబ్ మూవీని ఏప్రిల్ 10 నా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు.. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రభాస్ (Prabhas) బర్త్డే రోజు నుండి మొదలు పెట్టడం జరిగింది.

మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజ సాబ్ (Raja Saab) మూవీ హారర్ అలాగే థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ సినిమాకి పోటీగా తమిళ్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) రాబోతున్నట్టు తెలుస్తుంది. విక్రమ్ అలాగే కల్కి మూవీ సక్సెస్ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ (Thug Life) అనే సినిమాని ధరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

- Advertisement -

థగ్ లైఫ్ (Thug Life) సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నట్టు లేటెస్ట్గా అందుతుందా సమాచారం. అయితే టాలీవుడ్ నుండి వచ్చే సినిమాలు డేట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్న రాజ సాబ్ సినిమాని మాత్రం అనుకున్న డేట్ కి విడుదల చేయుటకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఈసారి వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంటుందా ఉండదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Raja Saab Release Date, Thug Life Release Date, Kamal Haasan, Prabhas, Clash between Prabhas and Kamal Haasan movies on April 10th 2025

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles